కరోనా దెబ్బకి ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పాటూ ఉద్యోగాలు ఊడిపోతాయనే బెడద కూడా ఎక్కువైంది. ముఖ్యంగా ఐటీ కంపెనీల పరిస్థితి ఎటు పోతుందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. కరోనీ ప్రభావంతో ఇతర దేశాల నుంచి వచ్చే ప్రాజెక్టులు ఆగిపోయే అవకాశం ఉంది.
ఎందుకంటే అమెరికాలాంటి పెద్దదేశాలు కొవిడ్ 19 దెబ్బకి అతలాకుతలం అయిపోయాయి అక్కడ ప్రస్తుత పరిస్థితి బాలేదు పైగా అక్కడ స్థానికులు కూడ లక్షల్లో ఉద్యోగాలు పోగొట్టుకునే పరిస్థితి తలెత్తింది.
ఈ నేపథ్యంలో భారత్ లో ఉన్న ఐటీ ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. రాష్ట్రంలో ఈ ఏడాది 10 వేల మందికి పైగా క్యాంపస్ లో ఇంటర్వీస్ లో ఎంపికయ్యారు. వారంతా జూన్ చివరి నుంచి ఆయా కంపెనీల కొటువుల్లో చేరాలి.
కానీ ప్రస్తుతం కరోనా ప్రభావంతో ఇతర దేశాల నుంచి వచ్చే ప్రజెక్టులు ఆగిపోయే ప్రమాదం ఉండటంతో క్యాంపస్ లో సెటక్ట్ అయిన వాళ్లకు ఆ ఉద్యోగాలు దక్కుతాయా లేదా అనే సందేహం నెలకొంది.
మరోవైపు ఐటీ కంపెనీల వాళ్లు మాత్రం సెలక్టైన వాళ్లను తీసుకుంటామని కాకాపోతే కొంత ఆలస్యం అవుతుందని చెబుతున్నారు. రాష్ట్రంలో గత జులై నెలాఖరు నుంచి డిసెంబర్ వరకూ ఐటీ కంపెనీలు ఇంజనీరింగ్ కాలేజ్ లకు వెళ్లిన అభ్యర్థులను సెలక్ట్ చేశారు.
టాపర్స్ ని మంచి ట్యాలెంట్ ఉన్న వాళ్లను మంచి ప్యాకేజ్ తో ఎంపిక చేసుకున్నారు. వీళ్లంతా వచ్చే జూన్ నుంచి వాళ్ల పొజిషన్స్ లో జాయిన్ చేసుకోవాల్సి ఉంది. ఈ ప్రక్రియ అంతా వచ్చే ఆగస్టుతో కంప్లీట్ అవ్వాలి.
కానీ కరోనా ప్రభావంతో కంపెనీలన్నీ ఇప్పుడు కరోనా దెబ్బకి పునరాలోచన చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. సెలక్టైన వాళ్లను ఉద్యోగాల్లోకి తీసుకోవడం ఆలస్యం కావచ్చని అది వచ్చే డిసెండర్ వరకూ ముందుకు వెళ్లొచ్చని సమాచారం. ఈ విషయాన్ని ప్రముఖ క్యాంపస్ సెలక్షన్ అధికారి వెళ్లడించినట్లు తెలుస్తోంది.
భారత్ లోని సాఫ్టవేర్ పరిశ్రమలకు 80 శాతం వరకూ ప్రాజెక్టులు అమెరికా, యూరప్ నుంచే వస్తాయి. కానీ ఇప్పడు అక్కడ పరిస్థితి ఏంటో మనందరికీ తెలిసిందే ఈ ప్రభావం మన ఐటీ కంపెనీల ఉద్యోగ నియామకాలపై ఉంటుందని ఐటీ పరిశ్రమల సీనియర్ అధికారులు చెబుతున్నారు.