శుక్రవారం, మార్చి 31, 2023
Homeజాతీయంఅక్రమ సంబంధం ప్రాణాలు తీసింది ..

అక్రమ సంబంధం ప్రాణాలు తీసింది ..

నిండుజీవితాలను లేనిపోని అనవసర వ్యవహారాల వల్ల మధ్యలోనే కోల్పోతున్నారు. పచ్చని కాపురాల్లో చిచ్చు పెట్టుకుంటున్నారు. లేని పోని కష్టాలతో రెండు కుటుంబాలను కన్నీరు పెట్టిస్తున్నారు. ఇలాంటి కథే జరిగింది ఇప్పుడు రోడ్డులో. వివవాహేతర సంబంధం ఉందన్న కట్టుకున్న భర్తే భార్యను కడదేర్చాడు. అక్రమ సంబంధం వాళ్ళ కాపురంలో నిప్పులు పోసింది.

ఆవేశం లో తీసుకున్న నిర్ణయం, తప్పుడు ఆలోచనలు నిండుజీవితాలను బలితీసుకున్నాయ్. ఈ నేపథ్యంలో భర్త చేతిలో భార్య హతం అయింది. రేపల్లే ఉప్పూడి రోడ్డులో ఈ దారుణం జరిగింది. తన భార్యకు  మరో  వ్యక్తితో అక్రమ సంబందం ఉదన్న అనుమానంతో ఆ భర్త ఆవేశంలో కట్టుకున్న భార్యని హత్య చేశాడు. భార్యని చంపి తానూ పురుగుల మందు తాగి డైరెక్ట్ గా రేపల్లె పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోయాడు. ఇక అతని పరిస్థితి విషమంగా ఉండటంతో తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు పోలీసులు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు రేపల్లె పోలీసులు.

RELATED ARTICLES

Most Popular