శనివారం, ఏప్రిల్ 20, 2024
Homeసినిమాత్వరలో మొదలుకానున్న టాలీవుడ్ సినిమా షూటింగ్స్

త్వరలో మొదలుకానున్న టాలీవుడ్ సినిమా షూటింగ్స్

టాలీవుడ్ కరోనా దెబ్బకు అతలాకుతలం అవుతుంది అని చెప్పాలి మనదేశంలో ఇప్పటికే సినిమా హాల్ అన్నీ రెండు నెలలుగా మూతపడి నష్టాలను చవిచూస్తున్నాయి. ఇదిలా ఉంటే విడుదలకు సిద్దంగా ఉన్న సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో తెలియని పరిస్థితి.

ఇప్పుడు ఇదే అదునుగా  ఆన్లైన్ స్ట్రీమింగ్ సంస్థలు నేరుగా సినిమాల్లో వారి వెబ్ సైట్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కొంతమంది చిన్న నిర్మాతలు వీటిపై మక్కువ చూపుతున్నారు. పెద్ద నిర్మాణ సంస్థలు మాత్రం దీనికి అంగీకరించలేదు.

ఇదిలా ఉంటే నిర్మాణ దశలో ఉన్న పెద్ద సినిమాలు మాత్రం భారీ నష్టాల్ని చవి  చూస్తున్నాయి. ఓవర్సీస్ మార్కెట్లో కూడా మన సినిమాలు భారీగా వసూళ్లు చేస్తుంది. కరోనా వల్ల అక్కడ మన సినిమాలు రిలీజ్ చేయని పరిస్థితి.

తెలుగు చలనచిత్ర పరిశ్రమ తిరిగి ప్రారంభం కావటానికి సినిమా పరిశ్రమలో కొంత మంది ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, దిల్ రాజు, రాజమౌళి, తదితరులు సమావేశమై సినిమా నిర్మాణాలు మొదలు పెట్టుకోవడానికి థియేటర్లు ప్రారంభించడానికి సడలింపులు ఇవ్వాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు.

చిరంజీవి మాట్లాడుతూ సినీ పరిశ్రమలో పనుల్లేక రోజు గడవని కార్మికులు చాలామంది ఉన్నారని, వారిని ఎలాగైనా ఆదుకోవాలన్నారు. పెద్ద సినిమాలు ఎలా ఉన్నా చిన్న సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉండడంతో నిర్మాతలు భారీ నష్టాలు చవి చూస్తున్నారని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని సడలింపులు కావాలని సినిమా పెద్దలు కోరడం జరిగింది. దీనితో సమావేశంలో పాల్గొన్న తలసాని శ్రీనివాస్ సుముఖత వ్యక్తపరిచారు. అయితే తలసాని సినిమా షూటింగ్స్ చేసుకునే విదంగా ప్రభుత్వానికి ఇండస్ట్రీ లో ప్రస్తుతం ఉన్న కష్ట నష్టాలపై తెలియజేసి సినీ పరిశ్రమను, కళాకారులను ఆదుకునే విదంగా సహాయం అందిస్తామని సినీ పెద్దలకు హామీ ఇచ్చారు.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular