ఆ విషయంలో ఏపీ కన్నా తెలంగాణా చాలా బెటర్… పవన్ కళ్యాణ్

0
55
Pawan Kalyan
Pawan Kalyan

రాష్ట్రంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉందన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కేంద్ర ప్రభుత్వం కరోనా మెడికల్ కిట్లు, మాస్కులు వంటి వాటితో రాష్ట్రానికి అన్నివిధాలా సహాయం చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కరోనా విషయంలో పూర్తిగా విఫలమైందన్నారు.

ఈ విషయంలో రాష్ట్రం పెద్దగా సీరియస్ గా తీసుకోవడం లేదన్నారు. నేడు బీజేపీ నాయకులతో రాష్ట్రంలో ఉన్న పరిస్థితులపై పవన్ కళ్యాణ్ వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా మాట్లాడారు. ఏపీలో పెరుగుతున్న కరోనా కేసుల తీరుపై చర్చించారు.

రాష్ట్రంలో లాక్ డౌన్ నడుస్తుండగా ప్రజాప్రతినిడులు బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తూ ర్యాలీలు, బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని అన్నారు. సీఎం సైతం కరోనాతో సహజీవనం చేయాలంటూ చేసిన వ్యాఖ్యలపై ప్రజల్లో ఒకరకమైన బయాందోళనలు రేకెత్తే అవకాసం ఉందని, లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలను ప్రభుత్వమే ఆదుకోవాలన్నారు. కరోనా నియంత్రణలో తెలంగాణాతో పోలిస్తే ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించడంలేదన్నారు.