Saturday, April 10, 2021
Home హెల్త్ తమలపాకు శుభ్రపధమే కాదు.. తమలపాకు ఉపయోగాలు అనేకం

తమలపాకు శుభ్రపధమే కాదు.. తమలపాకు ఉపయోగాలు అనేకం

అకు వక్క, కిళ్లి ఇలా శుభకార్యల్లో భోరజనాల్లో పసందు చేసే తమలపాకు మన ఆరోగ్యానికి చాలా మంచిదని మీకు తెలుసా… తమలపాకుల ఉపయోగాలు అనేకం. అందేకే పూర్వం నుంచి మన పూర్వీకులు దీని విరివిగా వాడేవారు.  అయితే ఈ కాలంలో ఆకు వక్కమాటే వినిపించడం లేదు. ఎందుకంటే కొన్ని అపోహల వల్ల నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని దీనికి భయపడి చాలామంది  పాన్ తినడాన్ని తగ్గించారు.

భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో పాన్ తినడం అనవాయితీ అంతేకాదు తమలపాకులను హిందూ ధర్మంలో శుభప్రదంగా కూడా భావిస్తారు. తమలపాకుతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. విటమిన్-సీ దీనిలో లబిస్తుంది అంతే కాక    కాల్షియం ఈ తమలపాకులో అదికంగా ఉంటుంది. తమలపాకులో శరీరానికి కావాల్సిన నిరోధక వ్యవస్థను కాపాడే అనేక ఔషద గుణాలు దాగి ఉన్నాయి. 

తమలపాకులో క్యాన్సర్ నిరోధక, డయాబెటిక్ వ్యతిరేక లక్షణాలు అదికంగా కలవు. అంతే కాక రక్తపోటు నివారణలో ఈ తమలపాకులు ఎంతో బాగా తోడ్పడుతాయని పలు అధ్యయనాల్లో వెల్లడైనట్లు శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అంతేకాక పూర్వకాలం గృహ వైద్యాల్లో  కడుపుమంట, ఉబ్బసం వంటి సమస్యలు ఉన్నవారికి ఇది ముఖ్యపాత్ర పోషించేది తమలపాకు.

శరీర, జీర్ణ సంబంధిత సమస్యలు, మానసికంగా ఒత్తిడిని తగ్గించడంలో ఇవి చాలా ఉపయోగం అందుకే చాలా మంది అన్నం తిన్నతరువాత పాన్ వేసుకోవడం మన సాంప్రదాయంగా ఉండేది. అయితే దీనితో పాటు నోటి క్యాన్సర్ కు సంబంధించిన ఆందోళనలు కొట్టిపాడేయ్యలేము. కానీ కేవలం తమలపాకులు మాత్రమే హానికరమైన ప్రభావాలను తెస్తున్నట్టు ఎక్కడా వెల్లడవలేదు. పైగా ఆయుర్వేద గ్రంథాల్లో తమలపాకు తినే విషయంలో వివిధ పద్ధతులు రాసి ఉండటం విశేషం.

Most Popular