బాలివుడ్ ఇండస్ట్రీకి ఈ సంవత్సరం వరుస దెబ్బలు తగులుతున్నాయి. నేడు మరోసారి అతి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఈ రోజు కొంత సేపటి క్రితం బాలివుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఈ రోజు బాంద్రా లోని తన సొంత ఇంట్లో ఉరి వేసుకుని చనిపోవడంతో భాలివుడ్ ఇండస్ట్రీ హీరోలూ, డైరెక్టర్ లూ ఈ విషయం తెలుసుకుని ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు.
ప్రస్తుతం సుశాంత్ కి 34 సంవత్సరాలు బాలివుడ్ టాప్ స్టార్లలో ఒకడు. ధోని సినిమాతో సక్సస్ తో పాటు మంచి పేరుని కూడా సంపాదించుకున్నాడు. సుశాంత్ కొన్నాళ్లుగా లాక్ డౌన్ కారణంగా సినిమాలు లేకపోవడంతో డిప్రేస్సన్ కి గురైనట్లు చెబుతున్నారు. నాలుగు రోజుల క్రితం తన మాజీ మేనేజర్ తను ఉంటున్న 14వ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది.
అయితే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న రూమ్ లో పోలీసులకు ఒక డైరీ దొరికినట్లు, దానిలో ఎదో రాసినట్లు తెలుస్తోంది. సుశాంత్ మరణంపై భాలివుడ్ ప్రముకులు సానుబూతి వ్యక్త పరుస్తూ సుశాంత్ ఇలాంటి పని చేస్తాడని అనుకోలేదని, యంగ్ యాక్టర్ మరియు తనకి ముందు.. ముందు మంచి బావిష్యత్తు ఉందంటూ ఇలా చేసుకోవడం బాలోవుడ్ కు కలవరపెట్టిందని ఆవేదన వ్యక్తపరిచారు.