గురువారం, మార్చి 28, 2024
Homeరాజకీయంరంగుల విషయంలో ఏపీ ప్రభుత్వానికి సుప్రీమ్ కోర్టులో ఎదురుదెబ్బ

రంగుల విషయంలో ఏపీ ప్రభుత్వానికి సుప్రీమ్ కోర్టులో ఎదురుదెబ్బ

ఏపీ ప్రభుత్వం పంచాయతీ కార్యాలయాలకు పార్టీ రంగులు వేసిందనే కారణంగా హైకోర్టు వాటిని తొలగించాలంటూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం వేసిన రంగులు తొలగిస్తే పార్టీ పరువు దెబ్బతింటుందనే ఉద్దేశంతో ఉన్న రంగులని కవర్ చేయడానికి ఇంకో కొత్త రంగు కలిప నాలుగు రంగులుగా మార్చి హై కోర్టు తీర్పు సవాల్ చేస్తూ సుప్రీమ్ కోర్టును ఆశ్రయించింది.

రాష్ట్ర ప్రభుత్వం. నేడు పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం హైకోర్టు తీర్పును ఏకీబవిస్తూ హై కోర్టు తీర్పు చాలా స్పష్టంగా ఉందని అబిప్రాయపడింది. దీనితో పాటు ప్రభుత్వం తీరుపై సీరియస్ అయిన సుప్రీంకోర్టు.. హైకోర్టు రంగులు తీసేయమని ఆదేశించిన తరువాత వాటిని తీయకుండా మీరు కొత్త జీవో ఇచ్చి కొత్త రంగులు ఎలా వేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

అయితే వైకాపా రంగులను పోలివున్న రంగులు నాలుగు వారాల లోగా తొలగించాలని ఆదేశించింది. ఒక వేల అలా తొలగించక పోతే కోర్టు దిక్కరణ చర్యలు తీసుకుంటామని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త జీవో ను సైతం రద్దు చేసింది. కోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగలడంతో టీడీపీ, బీజేపీ నాయకులు ప్రభుత్వంపై పలు విమర్శలు చేస్తున్నారు.

రాష్టం పరువు నేటి ప్రభుత్వం గంగలో కలుపుతుందంటూ దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం గద్దెనెక్కిన నాటి నుండీ ఒక్క కేసు కూడా గెలవకపోగా కోర్టు ఎన్ని సార్లు అక్షింతలు వేసినా తన పంథాను మార్చుకోవట్లేదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రాజ్యాంగ బద్దంగా నడుచుకోవాలని అన్నారు.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular