ఆదివారం, జూలై 21, 2024
Homeక్రీడలుఅనుష్క బంతులు అంటూ మాజీ క్రికెటర్ గవాస్కర్ కొహ్లి పై కామెంట్స్

అనుష్క బంతులు అంటూ మాజీ క్రికెటర్ గవాస్కర్ కొహ్లి పై కామెంట్స్

క్రికెట్ లో వివాదాలు అనేవి సర్వ సాదారణం ఎక్కువగా ఈ కామెంట్స్ ప్రత్యర్ధి జట్ల మద్య మరియు సొంత జట్టులోనే అప్పుడప్పుడూ ఈ వివాదాలు తారాస్థాయికి చేరుకుంటాయి. ఇక మాజీ క్రికెటర్లు చేసే వ్యాఖ్యలు ఎప్పుడూ పెద్ద దుమారమే రేపుతాయి. తాజాగా పంజాబ్ మరియు రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు మ్యాచ్ లో కోహ్లీ బ్యాటింగ్ లో విఫలం అవ్వగా ఫీల్డింగ్ లో రెండు క్యాచ్లను జారవిడవడం తో కోహ్లి  ఆటతీరుపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అసభ్యకర రీతిలో కామెంట్స్ చేసారు.

కరోనా వల్ల బయటి గ్రౌండ్ లో ప్రాక్టీస్ లేక తన బార్య వేసిన బంతులతో కోహ్లీ ప్రాక్టీస్ చేసి ఉంటాడు అంటూ సునీల్ గవాస్కర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వివాదంగా మారింది. గవాస్కర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు పెడార్ధంగా మారడంతో సోషల్ మీడియాలో కోహ్లీ మరియు అనుష్క శర్మ ఫ్యాన్స్ గవాస్కర్ పై విరుచుకు పడుతున్నారు. అయితే కోహ్లీ ఈ విసయాన్ని పెద్దగా పట్టించుకోకపోయినా అనుష్క శర్మ మాత్రం గవాస్కర్ చేసిన వ్యాఖ్యలపై కొంచెం ఘాటుగానే సమాదానం ఇచ్చింది.

గవాస్కర్ గారు మీరి ఎన్నో సంవత్సరాలు క్రికెట్ ఆడారుమీరు ఒక లెజెండ్ క్రికెటర్ ఇప్పుడు మీరు ఒక కామెంటర్ గా కూడా చేసిన మీరు ఇతర ఆటగాళ్ల వ్యక్తిగత విషయాలను ఇప్పటివరకూ బయటకు ప్రస్థావించి ఉండరని అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు 2020 వచ్చినా కూడా నాపై మాత్రం ఇప్పటికీ ఇలాంటి కామెంట్సే చేస్తున్నారు. మీరు అస్సలు ఏమీ మారలేదు.

ఎప్పుడూ ఏదో రూపంలో నన్ను క్రికెట్ విషయాలలోకి లాగి నాపై విమర్శలు చేస్తున్నారు ఇలాంటివి నన్ను ఎంతగానో భాదిస్తున్నాయి అంటూ గవాస్కర్ పై అనుష్క వ్యాఖ్యలు చేసింది. అయితే గవాస్కర్ ఇప్పటికే పలుమార్లు అనుష్క మరియు కోహ్లీ పెళ్ళికి ముందు అనేక వ్యాఖ్యలు చేసారు. కోహ్లీ పలు మ్యాచ్లు విఫలం అవ్వడానికి కారణం అనుష్క నే కారణం అంటూ ఆమెపై అనేక విమర్శలు చేసారు.    

 

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular