మంగళవారం, మార్చి 19, 2024
Homeజాతీయంపదో తరగతి పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకున్న హైకోర్టు

పదో తరగతి పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకున్న హైకోర్టు

కరోనా వల్ల లాక్ డౌన్ ఎఫెక్ట్ తో పదవతరగతి పరీక్షలు ఆగిపోవడంతో ఈ విషయం పై గత రెండు రోజులుగా విచారణ జరుపుతున్న హైకోర్టు నిన్నటి విచారణలో హైకోర్టు ప్రభుత్వాన్ని కొన్ని ప్రశ్నలు వేసింది. రాష్ట్రం లో కంటైన్మేంట్ జోన్లలో ఉన్న విద్యార్ధుల పరిస్థితి ఏంటని ప్రశ్నించింది.

పదవ తరగతి పరీక్షలు రాయని విద్యార్దులకు సప్లిమెంటరీ రాయడానికి  అవకాశం ఇస్తామని ప్రభుత్వ తరపు అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. అయితే సప్లిమెంటరీ లో ఫాస్ అయిన వారిని రెగ్యులర్ గా పరిగానిస్తారా లేదా అని కోర్టు నిన్న అడ్వకేట్ జనరల్ ను ప్రశ్నించడంతో ప్రభుత్వాన్ని అడిగి నేడు చెభుతామనడంతో నేడు హైకోర్టు విచారణ చేబట్టింది.

అయితే ప్రభుత్వం మాత్రం నేడు సప్లిమెంటరీలో ఫాస్ అయిన విద్యార్దులను రెగ్యులర్ కేటగిరీ లోనే పరిగణిస్తామని ప్రభుత్వం నిర్ణయించినట్లు అడ్వకేట్ జనరల్ నేడు హై కోర్టుకు తెలపడంతో హైకోర్టు జిహేచ్ఎంసీ, రంగారెడ్డి మినహా మిగతా రాష్ట్రాలకు పరీక్షలకు అనుమతి ఇచ్చింది. అయితే నేడు ఎస్ ఎస్ సీ బోర్డ్ డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు.

పిటిషనర్ మాత్రం రాష్ట్రం లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉందని ఇలాంటి టైం లో ఎగ్జామ్స్ ఎలా నిర్వహిస్తారని కోర్టుకు తెలిపారు. పంజాబ్ రాష్ట్రం ప్రస్తుతం ఎగ్జామ్స్ లేకుండానే గ్రేడింగ్ ఇచ్చి తరువాతి తరగతులకు అనుమతించిందని మన రాష్టం లో కూడా ఇలాగే చేస్తే తప్పేంటని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

కన్టైన్మేంట్ జోన్లుగా ఉన్న జిహేచ్ఎంసీ, రంగారెడ్డి జిల్లాలను మినహాయించి పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు సూచించడంతో రాష్ట్రం లో విడివిడిగా పరీక్షలు నిర్వహిస్తే ప్రశ్నాపత్రాల తయారీలో సమస్యలు తలెత్తుతాయని కోర్టుకు తెలిపారు. అయితే ప్రభుత్వ వాదనపై మండిపడ్డ హైకోర్ట్ మీకు విద్యార్ధుల ప్రాణాలు ముఖ్యమా లేదా సాంకేతిక సమస్యలు ముఖ్యమా అని ప్రభుత్వ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular