ఆదివారం, జూలై 21, 2024
Homeసినిమానేను కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభాస్, యూవీ క్రియేషన్స్ నన్ను ఆదుకున్నారు అందుకే ఇలా చేశా...తమన్

నేను కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభాస్, యూవీ క్రియేషన్స్ నన్ను ఆదుకున్నారు అందుకే ఇలా చేశా…తమన్

కరోన కారణంగా టాలివుడ్ టాప్ సినిమాలు పోస్ట్ అయ్యాయి అప్పటి వరకూ రిలీజ్ అవుతుందని అనుకున్న రాధేశ్యామ్ కూడా చివరి నిమిషంలో వాయిదా వేసి ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చింది చిత్ర యూనిట్ సినిమా అయితే పోస్ట్ పోన్ అయింది కానీ రాదే శ్యామ్ సినిమా పై ఉన్న హైప్ కారణంగా ప్రతీ రోజూ ఈ సినిమాపై ఏదో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటికి వస్తూనే ఉన్నాయి.

తాజాగా రాధేశ్యామ్ సినిమా పై మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.తమన్ సోషల్ మీడియాలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. రాధేశ్యామ్ సినిమా ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయే సినిమాగా ఉంటుందంటూ ఈ ప్రపంచంలో ప్రేమ ఎంత నిజమో రాధేశ్యామ్ కూడా అలాంటి నిజమైన సినిమా అంటూ కొనియాడారు. అంతేకాక రాధేశ్యామ్ సినిమా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పై గత కొద్ది రోజులుగా చర్చ నడుస్తుండడంతో ఆ విషయంపై కూడా క్లారిటీ ఇచ్చారు తమన్.

 గతంలో పండగ చేస్కో సినిమా మినహ ఒక్క సినిమా కూడా తన చేతిలో లేని స్థితిలో ప్రభాస్ సొంత సంస్థ అయిన యూవీ క్రియేషన్స్ లో వంశీ, ప్రమోద్ లు మహానుభావుడు, భాగమతి వంటి రెండు సినిమాలు ఇచ్చి తనను ఎంతగానో ఆదుకున్నారని తెలిపారు. అంతేకాక తనకు సాహో ట్రైలెర్ వంటి వాటికి కూడా అవకాసం ఇచ్చారని తమన్ తెలిపారు.

ఇక రాధేశ్యామ్ సినిమా డబ్బులు గురించి కాకుండా తాను కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేసారనే ఉద్దేశ్యంతోనే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చానని తెలిపారు తమన్. ఇక ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా రిలీజ్ డేట్ ను త్వరలో అనౌన్స్ చేస్తారని తెలుస్తోంది.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular