మంగళవారం, నవంబర్ 28, 2023
Homeఅంతర్జాతీయంఅక్కడ కరోనా వస్తే కాల్చేస్తున్నారా..?

అక్కడ కరోనా వస్తే కాల్చేస్తున్నారా..?

ఉత్తరకొరియా పేరు చెప్పగానే అక్కడ మనకు కనిపించేది కేవలం కిమ్ జాన్ ఉన్, ఎప్పుడూ రకరకాల వార్తలతో నమ్మసఖ్యం కాని విన్యాసాలతో వార్తల్లో నిలుస్తారు. క్షిపణి ప్రయోగాలు, అసలు ఆ దేశంలో ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియని పరిస్థితి. బయటి దేశాలతో ఉత్తరకొరియా అనుబంధాలు చాలా తక్కవ.

చైనాతోనే 80 శాతానికి పైగా వాణిజ్య ఒప్పందాలు ఉంటాయి. అక్కడ స్థానికులతో ఎవ్వరికీ మాట్లాడే అవకాశం ఉండదు. మనం ఉత్తర కొరియా వెళ్లాలంటే చైనా నుంచి వెళ్లాలి. అక్కడికెళ్లినవారు ఎవరైనా అక్కడి వ్యవస్థ గురించి ఆరా తీస్తే తాట తీస్తారు. అలాంటి ఉత్తర కొరియా కరోనాని తమ దేశానికి రాకుండా ఎలా అడ్డుకొంటుంది అనేదు అందరినీ ఆశ్చర్యపరిచే ప్రశ్న.

అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక వార్త ప్రచారం చేస్తోంది. ఉత్తర కొరియాలో ఎవరికైనా కరోనా సోకిందని నిర్థారణ అయితే వాళ్లను కాల్చి పడేస్తున్నారట అని నెటిజన్ల మధ్య  గాసిప్స్ వచ్చాయ్ అయితే అది అవాస్తవం. మరెలా ఆదేశం కరోనాని అడ్డుకుందనేగా మీ సందేహాం అదెలాగో మీరే చదవండి.

గతేడాది చివర్లో కరోనా చైనాలో పుట్టింది అక్కడ ఉగ్రరూపం దాల్చింది. ఈ విషయం తెలిసిన వెంటనే కిమ్ అలర్ట్ అయ్యారు. తమ దేశ సరిహద్దులను మూసేశారు. మొత్తం అంతర్జాతీయ ప్రయాణాలను పూర్తిగా రద్దుచేసేశారు.

అయితే ఉత్తర కొరియాలో 90 శాతం ప్రయాణాలన్నీ చైనాకే ఉంటాయ్. విదేశాలకు వెళ్లేందుకు ఎవ్వరికీ అనుమతి ఇవ్వలేదు ఇక బయటినుంచి వచ్చినవాళ్లకు ఖచ్చితంగా వైద్య పరీక్షలు చేయించారు.

ఇక ఆ దేశానికి వెళ్లే విదేశీయులు ఎవ్వరైనా ప్రతీ రోజూ అధికారులకి రిపోర్ట్ చేయాల్సిందే. ఇక జనవరిలో కొరియాలో పర్యటిస్తున్న విదేశీయులను తీసుకెళ్లి క్వారంటైన్ లో వేశారు.  ఇన్ని చర్యలు వెంటవెంటనే తీసుకోవడం వల్ల అక్కడ కరోనా ప్రభావం లేదు.

నియంత చర్యలు తూచా తప్పకుండా పాటించడం అక్కడ ప్రజలకు ఎప్పటినుంచో అలవాటైపోయింది. సరిగ్గా చెప్పాలంటే ఆ దేశంలో ఎప్పటినుంచో సోషల్ డిస్టెన్స్ ఉంది ఉత్తరకొరియా నియంత మాట కాదని ఎవరైన గీత దాటితే ఇక అంతే సంగతులు మెడలో కత్తి వేలాడినట్టే.

అనవసరంగా ఎప్పుడూ ఎవరూ బయటకి రారు కేవలం పనులు చేసుకునేవారు సరుకుల కోసం బయటకు వచ్చేవారు తప్ప మిగతావారంతా అదుపులోనే ఉంటారు. ఏ పనీ లేకుంటే ప్రజలు ఇంట్లోనే ఉండాలి. అక్కడి ప్రజలు కూడా దీన్ని పాటిస్తారు అది వాళ్లకి ఇష్టం ఉండి కావచ్చు లేక కావచ్చు.

ఇక ప్రపంచదేశాలు ఉత్తర కొరియాని ఎప్పడో ఒంటరిని చేశాయి. కానీ ఇవన్నీ ఇప్పడు మనం ఇక్కడ లాక్ డౌన్ లో పాటిస్తున్నవే కదా కాబట్టే అక్కడ కరోనా అనేది ఇప్పటికీ అడుగుపెట్టలేదు. ఉత్తర కొరియాలో మనలాగా ఇంటర్నెట్ ఉండదు అక్కడ ప్రబుత్వ అధికారులలో మొత్తం 400 మంది మాత్రమె ఇంటర్నెట్ వినియోగిస్తారు.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular