Tuesday, February 23, 2021
Home సినిమా హీరోయిన్ కంగనా పై రేప్ చేస్తామంటూ బెదిరింపులు….

హీరోయిన్ కంగనా పై రేప్ చేస్తామంటూ బెదిరింపులు….

దేశవ్యాప్తంగా చిన్నా పెద్దా అంటూ తేడా లేకుండా మహిళలపై జరుగుతున్న దాడులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం మహిళలపై దాడులు ఎదో ఒక రాష్ట్రంలోనే కాదు దేశంలో చాలా వరకూ రాష్ట్రాలు ఈ సమస్యతో పోరాడుతున్నాయి. తాజాగా బాలివుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ను రేప్ చెయ్యాలంటూ సోషల్ మీడియా వేదికగా పెదిరింపులకు దిగిన ఉదంతం తాజాగా వెలుగుచూసింది.

పూర్తి వివరాలలోకి వెళితే బాలివుడ్ లో ఎప్పుడూ ఒక ఫైర్ బ్రాండ్ లా ఉండే కంగనాకు గతకొద్ది రోజులుగా ఒకదాని వెనుక ఒకటి కోర్టు కేసులు వచ్చి పడుతున్నాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ తాక్రే పై అనుచిత వ్యాఖలు చేసారని ఆమె వ్యాఖ్యలు మత విద్వేషాలను రోచ్చాగోట్టే విదంగా ఉన్నాయంటూ ఆమెపై కేసు నమోదుచేయగా దీనిపై కంగనా రిప్లై ఇస్తూ “పప్పూ సేనకు నేనంటే చాలా ఇష్టం అనుకుంటా నన్ను వదిలి ఉండలేకపోతున్నారు అందుకే త్వరలో తిరిగి వచ్చేస్తా” అంటూ కామెంట్ చేసింది కంగనా.

ఈ ఘటనపై కోర్టులో కేసు నమోదు అవ్వగా ఈఘటనను ఉద్దేసించి మేహేంది రజా అనే ఒక వ్యక్తి కంగనా ను రేప్ చెయ్యాలంటూ ట్విట్టర్ లో పోస్ట్ చెయ్యడంతో ఈ విషయాన్ని గమనించిన పోలీసులు అతనిపై కేసు నమోదు చేసారు. తనపై కేసు నమోదైందని తెలుసుకున్న మెహంది రజా ట్విట్టర్ లో అందరికీ క్షమాపణలు చెబుతూ నా ట్విట్టర్ ఎవరో మిస్ హేండిల్ చేసారని అందుకే నేను క్షమాపణలు చెబుతున్నట్లుగా తెలిపాడు.

అయితే ఈ కామెంట్ తను చేసిందా లేక మరెవరైనా తన ఎకౌంటు నుండి చేసారా అనేదానిపై విచారించనున్నారు. పోలీసులు మాత్రం సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడానికి చేసి ఉంటాడని భావిస్తున్నారు.  

 Read Also….   త్వరలో రవితేజ భారీ బడ్జెట్ సినిమా..

 

 

Most Popular