బోరు బావిలో పడ్డ మూడేళ్ల బాలుడి మృతి…

boru bavi news

తెలంగాణా లో మెదక్ జిల్లాలో ఉన్న పోడ్చన్ పల్లి అనే గ్రామంలో లో బుదవారం సాయంత్రం 4 గంటలకు ఈ దుర్ఘటన జరిగింది. బోరు బావిలో పడ్డ అబం సుబం తెలియని మూడేళ్ల బాలుడు అర్ధరాత్రి మృతి చెందాడు. సుమారు 12 గంటల పాటు మృత్యువుతో పోరాడిన సాయి వర్ధన్తన  ప్రాణాలు వదిలాడు.

17 అడుగులు లోతు నుంచి బాలుడి మృత దేహాన్ని NDRF  సిబ్బంది వెలికి తీశారు. బోరు బావికి సమాంతరంగా  17 అగుగుల  గొయ్యి  తవ్వి బాలుడి మృత దేహాన్ని బయటికి తెచ్చారు. 12 గంటల పాటు ఎంత ప్రయత్నించినా ఆ కుర్రాడు విగత జీవిగానే బయటికి తీసుకొచ్చారు.

సిబ్బంది ఎంత ప్రయత్నించినా గుంతలో ఆక్సిజన్ అందపోవడంతో బాబు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. అంతా చూస్తుండగానే పెను  ఘోరం జరిగిపోయింది.  సాయి వర్ధన్ కు తాత అయిన బిక్షపతి వేసిన బోర్లలో నీరు దొరకకపోవడంతో రెండు బావుల్ని మూతవేశారు. కానీ మరో బావిని పూడ్చడం మర్చిపోయారు. ఇంతలోనే చిన్నారి ఆడుకుంటూ అటుగా  వెళ్లి పడిపోయి ప్రాణాలు కోల్పోయాడు.

అభం శుభం తెలియని ఆ బాలుడు ఆ క్షణం వరకూ తన బుడి బుడి అడుగులు వేసుకుంటూ ఆడుకుంటూ ఉన్న బాలుడు ఆ మృత్యు గృహం లో పడిపోయాడు. చిన్నారి తల్లి తండ్రులు తీవ్ర  ఆవేదనకు లోనయ్యారు మేము ఏమి పాపం చేశాం అంటూ తల్లడిల్లిపోతున్నారు..

బోరు బావిలో నుంచి బాలుడిని తెల్లవారు జామున 4.30 నిమిషాల సమయంలో బయటకు తీసుకువచ్చారు. అప్పటికే బాలుడు చనిపోయి ఉన్నాడు. దీంతో మృత దేహాన్ని స్థానిక ఆసుపత్రి కి తరలించారు. రెండు రెస్క్యు టీం లు సుమారు  12 గంటల పాటు ఎంతగానో చేసిన ప్రయత్నం అంతా విఫలమైంది. అల్లారు ముద్దుగా పెంచుకున్నతన కొడుకు వికత జీవిగా బయటికి రావడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అయ్యారు.

బాలుడు కుటుంబ సభ్యులు అంతా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. రాత్రంతా పిల్లాడి కుటుంభ సభ్యులు  బయటికి వస్తాడని దేవుడిని ప్రార్థిస్తూ వేచి చూశారు. కానీ నిర్జివంతో బయటికి రావడం తట్టుకొలేకపోయారు. కన్నీరు మున్నిరుగా విలపించారు. వారి రోదనలు అక్కడున్న వారందరి హృదయాలను ఎంతగానో కలిచి వేశాయి.

ఇలాంటివి ఎన్ని ఘటనలు జరిగిన  పరిస్థితులు మాత్రం ఏమాత్రం మారడం లేదు. దీని గురించి అదికారులు ఎంత అవగాహన చేసినా “వాల్ట” చట్టం లాంటి ఎన్ని చర్యలు తీసుకున్న ప్రజలు మాత్రం వాటిని పాటించకుండా వారికి తగినట్టుగానే చేస్తున్నారు. దీనికి కారణం ప్రజలలో నెలకొన్న నిర్లక్ష్యం ఉందనడంలో సందేహం లేదు.

ఇప్పటికైనా సాయి వర్ధన్ లాంటి చిన్నారుల ప్రాణాల కోసం దయచేసి బోరు బావులు వేసిన వారికి వేసే వారికి చెప్తుంది ఏమిటంటే అందరు కూడా బోరు వెయ్యగానే దాన్ని పూడ్చివేయ్యాలి ఇలాంటి వాటి దగ్గర సమాజ బాద్యత ఎరిగి నటుచుకోవాలని చూసిస్తున్నాం. 


స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి