బుధవారం, అక్టోబర్ 4, 2023
Homeజాతీయంబోరు వేసిన అరగంటలోనే ఇలా...120 అడుగుల బోరుబావి లో పడ్డ 3 ఏళ్ల బాలుడు

బోరు వేసిన అరగంటలోనే ఇలా…120 అడుగుల బోరుబావి లో పడ్డ 3 ఏళ్ల బాలుడు

ఇప్పటికే గతంలో  చాలా చోట్ల ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే.. చిన్నారులు ఆడుకుంటూ పడుతున్న ఘటనలు  ఆక్సీజన్ అందకపోవడం లాంటివి జరుగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా మేదక్ జిల్లా పాపన్న పేట మండలం పొడ్చన్ పల్లిలో గోవర్థన్ అనే రైతు తన పంట పొలంలో నీటి కోసం మూడు బోరు బావులు తవ్వగా నీరు పడలేదు. బుధవారం వాటిని పూడ్చే క్రమంలో అక్కడే ఆడుకుంటున్న ఓ 3 ఏళ్ల బాలుడు బోరు బావిలో పడిపోయాడు.

బోర్ వేసిన అరగంటలోనే ఇలా… ఆందోళన లో తల్లి తండ్రులు

బోరు వేసిన అరగంటలోనే ఆడుకుంటూ  బాలుడు అటుగా వెళ్లి  పడిపోయాడు. పంట పొలంలో నీళ్ళ కొసం 3 బావులు ఒక రైతు తవ్వించగా నీరు పడటం లేదని వాటిని అలాగే వదిలేశాడు. రెండో బోరు బావిలో ఈ బాలుడు పడ్డాడు. 120 అడుగుల బోరు బావిలో పడ్డ మూడేళ్ల బాలుడు పేరు సంజయ్ సాయి వర్ధన్. హైదరాబాద్ లోని పఠాన్ చెరువు నుంచి 4 నెలల క్రితం అమ్మమ్మ ఇంటి నుంచి బాలుడుని తల్లి తండ్రులు పొడ్చన్ పల్లికి తీసుకొచ్చారు. కాగా ఈ ఘటనతో బాలుడు తల్లి తండ్రులు తీవ్ర విషాదానికి గురి అయ్యారు.

అయితే బుధవారం సాయంత్రం 4 గంటలకు ఈ ఘటన జరగగా.. బాలుడిని వెలికితీసేందుకు హైదరాబాద్ నుంచి ప్రత్యెక బృందంలను పోడ్చెల్ రప్పిస్తున్నారు.  ఇప్పటికే జిల్లా ఎస్పీతో సహా రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యల్లో భాగంగా రెండు జేసీబీలు మరియు రెండు ఫైరింజిన్లను ఆ ప్రాంతానికి చేరుకున్నాయి.  అయితే బాలుడికి సహాయక చర్యల్లో భాగంగా ఆక్సిజన్‌ పైపు లోనికి పంపించేటప్పుడు  25 ఫీట్ల లోతులోనే అది ఆగిపోయింది. దీంతో చిన్నారి సాయి వర్దన్‌ 25 అడుగుల వద్ద మాత్రమే ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. సహాయ చర్యలను కలెక్టర్‌ ధర్మారెడ్డి మరియు ఎస్పీ చందనాదీప్తి పర్యవేక్షిస్తున్నారు. తల్లి తండ్రుల ముందే ఆడుకుంటున్న ఆ చిన్నారి బోరు బావిలో పడిపోవడం తీవ్ర విషాదానికి గురిచేసింది. తమ కొడుకు క్షేమంగా బయటకు రావాలని ఆ దేవుడిని వేడుకుంటున్నారు.

WhatsApp Group Join Now
RELATED ARTICLES
- Advertisment -

Most Popular