సోమవారం, నవంబర్ 28, 2022
Homeజాతీయంలాక్ డౌన్ లో ఒకే ఒక్కడి సంపద పెరిగింది

లాక్ డౌన్ లో ఒకే ఒక్కడి సంపద పెరిగింది

కరోనా తీవ్రత  ప్రపంచాన్ని వణికిస్తోంది ఇక లాక్ డౌన్ ల దెబ్బకి ఆర్ధిక వ్యవస్థలు చిన్నాబిన్నం అవ్వగా ఇక దిగువ మద్య తరగతి వారి పరిస్థితి మరీదారునం ఇక సామాన్య వ్యాపారాలు చేసుకునే వారు కూడా బాగా దెబ్బతిన్నారు. దుఖాణాలు, ముడిసరుకులు, నిత్యావసరాలు ఇలా ప్రతీ ఒక్కటీ కొనుగోళ్లు తగ్గడంతో కుదేలైపోయాయి. ఇక ప్రపంచ దేశాలతో పాటు మనదేశం కూడా మరోవైపు స్టాక్ మార్కెట్ లు కూడా తీవ్ర నష్టాల్లో నడుస్తున్నాయి.

ఇలాంటి సమయంలో సంపదను సామాన్యులు పెంచుకోవడం, సంపాదించడం చాలా కష్టం కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా 5 శాతం తన సంపదను పెంచుకుని సరికొత్త రెకార్డ్ సృష్టించిన వ్యక్తి డీమర్ట్ అధినేత రాధాకృష్ణ దమాని. ఇతను మొదట ముంబైలోని సింగిల్ బెడ్ రూం అపార్ట్ మెంట్ స్థాయి నుంచి తన ప్రస్థానం ప్రారంభించిన దమానీ అంచెలంచెలుగా అబివృద్ది చెందుతూ ఇండియా నేడు రిచ్చెస్ట్ బిలియనీర్లలో ఈయన ఒకరిగా నిలిచారు.

ప్రస్తుతం ఈ ఏడాది కరోనా లాక్ డౌన్ సమయంలో దమాని సంపద 5 శాతం పెరిగి 10.2 బిలియన్ డాలర్లకు చేరుకుంది.ప్రపంచ వ్యాప్తంగా 12 మంది అత్యంత ధనవంతులలో లాక్ డౌన్ టైమ్ లో కూడా సంపద పెంచుకున్న ఏకైక వ్యక్తి దమానీనే కావడం విచిత్రం. ఇక ఈ విషయాన్ని బ్లు బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ అనే తాజా రిపోర్ట్ ఈ విషయాన్ని వెల్లడించింది.

ఫిబ్రవరిలో ముకేశ్ అంబానీ తర్వాతి స్థానంలోకి దేశంలో సెకండ్ రిచ్చెస్ట్ బిలియనీర్ గా దమానీ ఇప్పుడు నిలిచారు. దమానీ ఇప్పటివరకూ ఉన్న  సంపదలో అధిక శాతం సంపద ఎవెన్యూ సూపర్ మార్కెట్స్ షేర్ల నుండే  వస్తుంది. ఈ సంవత్సరం ఈ షేర్ల విలువ సుమారు 18 శాతం పెరిగింది.ముఖేష్ అంబానీ సంపద ఏకంగా 32 శాతం తరిగిపోగా లాక్  డౌన్ సమయంలో దమానీ సంపద 5 శాతం పెరగటం విశేషం.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular