మంగళవారం, జూన్ 6, 2023
Homeభక్తిSankranti 2022 సంక్రాంతి అంటే ఏమిటి ఎలా జారుపుకుంటారు, సంక్రాంతి విశిష్టత

Sankranti 2022 సంక్రాంతి అంటే ఏమిటి ఎలా జారుపుకుంటారు, సంక్రాంతి విశిష్టత

Sankranti 2022 : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ శోభ మొదలయ్యింది స్కూళ్ళు, కాలేజీలకు ప్రభుత్వాలు ఇప్పటికే సెలవులు ప్రకటించడంతో ఇతర ప్రాంతాల్లో ఉంటున్న తెలుగు వారు సంక్రాంతి కి పల్లెలకు బయలుదేరుతుండడంతో బస్సులు, ట్రైన్లు కిక్కిరిసిపోతున్నాయి.  

ఇక ఈ నెలలో 13వ తారీకున ముక్కోటి ఏకాదశి కాగా  14, 15, 16 తేదీలలో 14వ తారీకున భోగి (bhogi) 15వ తారీకున మకర సంక్రాంతి (sankranti) 16వ తారీకున కనుమ (kanuma) పండుగలు వచ్చాయి.

సంక్రాంతి పండుగను తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల్లో ఉన్న తెలుగు వారు ఈ పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. అయితే ఈ పండుగ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు లో కూడా జరుపుకుంటారు.

మనం Sankranti 2022 ఎలా చేసుకుంటామో నార్త్ ఇండియా లో కూడి ఈ పండుగను Lohri  పేరుతో చాలా విశిష్టంగా ఆచరిస్తారు   అసలు ఈ Sankranti 2022 పండుగ అసలు ఎలా వచ్చింది ఎందుకు జరుపుకోవాలో ఇప్పడు తెలుసుకుందాం.

సంక్రాంతి పండుగ Sankranthi Festival in Telugu

అసలు మనిషి మనుగడకు ప్రధాన కారణం ఈ విశ్వం అలాంటి ఈ విశ్వంలో మనం కనిపించే దేవిడిలా కొలిచే సూర్యుడి గమనం ఈ జనవరి లోనే మారుతుంది. అనగా సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణం లోకి చేరుతాడు అందుకే ఈ సూర్యుని గమనం ఆధారంగా ఈ సంక్రాంతి sankranthi పండుగను జరుపుకుంటాము అయితే  ఈ sankranthi పండుగ ను 3రోజులు జరుపుకోవడానికి గల ప్రాధాన్యం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

  1. బోగి పండుగ (bhogi) : బోగి పండుగ రోజు తెల్లవారుజామున లేచి తల స్నానం చేసి ఆవు పేడతో చేసిన పిడకలను గూడిలా పేర్చి మంట వేస్తారు. ఇంకొకటి ఇంటిలో ఉండే పాత వస్తువులను ఒక చోట పేర్చి దహనం చేయడాన్ని బోగి (bhogi) అని అంటారు.
  • ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉండే నేగిటీవ్ ఎనర్జీ తొలగిపోతుందని నమ్ముతారు.
  • అంతేకాక చిన్నపిల్లలకు ఈ రోజునే బోగిపళ్ళు పోయడం ఆనవాయితీ ఒకరకంగా చెప్పాలంటే ఈ బోగిపళ్ళు (bhogi pallu) ఆద్యాత్మికంగా పిల్లలకు చాలా ఉపయోగాలు ఉన్నాయి.
  • అద్యాత్మికంగా చూస్తే ఇలా బోగిపళ్ళు పోయడం వళ్ళ ఆ శ్రీమన్నారాయణుడి అనుగ్రహం లబిస్తుందని నమ్ముతారు.
  • ఇంకో విధంగా చూస్తే చిన్న పిల్లల తల పై భాగం చాలా సున్నితంగా ఉంటుంది ఈ ప్రదేశంలో భ్రహ్మరంద్రం ఉంటుంది కావున పెద్దలు ఈ రేగిపల్లను పలు మార్లు తలపై పొయ్యడం వళ్ళ ఆ బ్రహ్మరంద్రం తెరుచుకుంటుంది దీనితో అనంతమైన జ్ఞానం తో పాటు భగవంతుని అనుగ్రహం లబిస్తుంది కనుకే బోగ భాగ్యాలు ప్రసాదించే పండుగే భోగి (bhogi) పండుగ అందుకే అంత ప్రాధాన్యం ఇస్తారు.

2. మకర సంక్రాంతి పండుగ (sankranti): Sankranti 2022 అసలు మకర సంక్రాంతి అని దీని పేరు ఈ రోజున సూర్యుడు      మకర రాశి లోకి ప్రవేశిస్తాడు కనుక దీనిని మకర సంక్రాంతి అని పిలుస్తారు.

  • ఈ రోజు ఇంటి వాకిట్లో రంగు రంగుల ముగ్గులు వేసి వాటిలో ఆవు పేడలో నవదాన్యాలు వేసి గొబ్బెమ్మలుగా చేసి ఆ రంగావల్లులలో అలంకరిస్తారు
  • మకర సంక్రాంతి రోజున వారి వారి స్తోమతకు తగిన దానాలు చేస్తారు. వరి దాన్యం తో పాటు దీనిలో రైతులు పండించే పంటలలో కొద్దిగా పక్కకు తీసి వాటిని దానంగా ఇస్తారు అంతేకాక దాన్యం వంటి వాటిని ఆ గ్రామంలో ఉన్న గ్రామ దేవత గుడికి దాన్యాన్ని సమర్పిస్తారు.
  • స్త్రీలు సుమంగళిగా ఉండడానికి గాజులు, కుంకుమ, పసుపు, బట్టలు వంటివి ముత్త్యదువులకు ఇస్తారు.                                                                               

3. కనుమ పండుగ (kanuma) : సంక్రాంతి మూడవ రోజున కనుమ పండుగను జరుపుకుంటారు. ఈ రోజు      రైతులకు, వ్యాపారం చేసుకునే వారు వారికి సహాయం చేసిన వాటిని పూజిస్తారు.

  • కనుమ పండుగ రోజు ఇంటి ముందు ముగ్గులు వేసి చిన్నా పెద్దా అందరూ కోలాహలంగా ఉంటారు
  • కనుమ పండుగ రోజున లక్ష్మీ దేవిగా పూజించే గోమాతను పసుపు కుంకుమతో అలంకరించి పూజిస్తారు. అంతే కాక రైతులకు వ్యవసాయంలో సహాయం చేసే ఎద్దులను కూడా ఈ రోజు పూజిస్తారు.

    ఈ మూడు రోజులూ పూర్తైన తరువాత ఆయా గ్రామాలలో మంచి రోజు చూసి గ్రామ దేవతను ఊరంతా        ఊరెంగించి సంబరాలు చేసి  

    జాతరను నిర్వహిస్తారు. ఇలా చేయడం వాళ్ళ గ్రామంలో ఎలాంటి దుష్ట శక్తులు గ్రామం లోకి అడుగు        పెట్టవు అంతేకాక గ్రామంలోకి ఎలాంటి వ్యాదులు చేరకుండా గ్రామ దేవత కాపాడుతుందని నమ్మకం.

RELATED ARTICLES

Most Popular