ఒళ్ళంతా శానిటైజర్ స్ప్రే చేసే సెన్సార్ మెషిన్.

0
183
Sanitizer Spray sensor mechine
Sanitizer Spray sensor mechine

ప్రస్తుతం చేతులు సబ్బుతో శుభ్రం చేసుకోవడం, శానిటైజర్ రాసుకోవడం సామజిక దూరం పాటించడం తప్పక పాటించాల్సిన నియమాలు ఈ నేపథ్యంలో శరీరం మొత్తం శానిటైజర్ స్ప్రే చేసే సెన్సార్ మిషన్ ని ఐఐటీ వారణాసి వారు ఆవిష్కరించారు. సెన్సార్ ఆధారంగా పనిచేసే ఈ పరికరం దగ్గరకొచ్చిన వాళ్ళను గుర్తించి వాళ్లపై పది నుంచి 15 నిమిషాల పాటు శానిటైజర్ ను స్ప్రే చేస్తుంది.

ఇలా స్ప్రే అవ్వడంతో దుస్తులు షూ దగ్గరనుంచి శరీరం అంతా శానిటైజ్ అవ్వడంతో కరోనా వైరస్ తో పాటు హానికర వైరస్లు అన్నీ చనిపోతాయి. ప్రస్తుత అవసరానికి అనుగుణంగా ఈ పరికరాన్ని తయారుచేసినట్టు ఐఐటీ ప్రొఫెసర్ మిశ్రా తెలిపారు. అయితే దీనితో శానిటైజ్ చేసిన తరువాత కూడా సామాజిక దూరం మాస్కులు ధరించడం తప్పనిసరి అని చెబుతున్నారు.  ఇక ఈ పరికరాన్ని ఆఫీస్ లో అలాగే జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లో పెట్టడంవల్ల ఏమైనా వైరస్ ఉంటే శానిటైజ్ అవుతుందని చెబుతున్నారు.