ప్రముఖ స్మార్ట్ పోన్ల దిగ్గజ సంస్థ Samsung నుండి నేడు ఎఫ్ సిరీస్ లలో కొత్త వేరియన్ మోడల్ Samsung Galaxy F22 ను నేడు మన దేశంలో రిలీజ్ చేసింది. ఇక ఈ ఫోన్ కలర్ విషయానికి వస్తే రెండు కలర్స్ లో విడుదల చేసింది ఒకటి డెనిమ్ బ్లూ మరియు డెనిమ్ బ్లాక్. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 22 లో ప్రధానంగా ఎప్పటినుంచో ఈ ఫోన్ బ్యాటరీ ని ఆసంస్థ హైలేట్ చేస్తూ వచ్చింది.
దానికి తగ్గట్టుగానే 6000mah గల అతి పెద్ద కెపాసిటీ గల బేటరీని తీసుకువచ్చింది అంతేకాక 15 Watt చార్జెర్ తో లబిస్తోంది. ఇక డిస్ప్లే విషయానికి వస్తే 6.4 ఇంచ్ (16.23cm) హేచ్డీ ప్లస్ 90హెడ్జ్ రిఫ్రెష్ రేట్ తో కూడిన సూపర్ అమోల్ద్ డిస్ప్లే లబిస్తుంటే ఆపరేటింగ్ సిస్టమ్ అండ్రాయిడ్ 11 మీడియా టెక్ హీలియో G80 ప్రొసెసర్ ని అందిస్తుంది.
ఇక సేక్యురుటీ విషయానికొస్తే పేస్ అన్ లాక్ తో పాటు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ఫింట్ ఆప్షన్ లబిస్తుంది. కెమెరా గురించి చూస్తే 48MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ కెమెరా, 2MP మైక్రో కెమెరా, 2MP డెప్త్ కెమెరా తో పాటు 13MP సేల్ఫీ కెమెరాలు ఇందులో లబిస్తున్నాయి.
ఇక ఈ ఫోన్ లో హైలేట్ విషయం అంటే మెమొరీ 4GB ర్యామ్ 64GB రోమ్ తో 1టీబీ వరకూ ఎక్స్టెన్డబుల్ చేసుకునే సదుపాయం ఇందులో లబిస్తుంది. శాంసంగ్ నుండి 15000 లోపు బడ్జెట్ లో రిలీజ్ చేసిన పోన్లలో అత్యధిక ఫీచర్లతో బెస్ట్ ఫోన్ లలో Samsung Galaxy F22 ఒకటి కానుంది. ప్రస్తుతం ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ లో 12500 రూ. లబిస్తోంది