దక్షిణ కొరియాకు సంబందించిన అతిపెద్ద దిగ్గజ సంస్థ శాంసంగ్ తన గెలాక్సీ ఏ70 కి కొనసాగింపుగా ఏ 71ను నేడు తీసుకు వచ్చింది. ఈ మోడల్ ఇప్పటికే] పలు దేశాల్లో రిలీజ్ చేసిన శాంసంగ్ ఇండియాలో కరోనా ఎఫెక్ట్ వల్ల ఆలస్యంగా రిలీజ్ చేసింది. అయితే ఇప్పుడు రిలీజ్ చేసిన మోడల్ లో పాత ఏ70 కి ఇంకొన్ని ఫ్యూచర్స్ జోడించి రిలీజ్ చేసింది.
ప్రస్తుతం ఏ71 లో ఒకే ఒక్క వేరియంట్ 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మాత్రమె అందుబాటులోకితేవడం అనేది కొంచే డ్రా బ్యాక్ అనే చెప్పాలి. ఇక Samsung Galaxy A71 Specifications విషయానికొస్తే ఈ ఫోన్ మొత్తం మూడు డిఫరెంట్ కలర్స్ అవి Prism crush black , Prism crush blue, Prism crush silver లలో విడుదల చేసింది. ఈ ఫోన్ 5జి సపోర్ట్ తో వస్తుంది. ఇక డిస్ప్లే 6.7’’ 0 అమోల్ద్ ప్లస్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే మరియు క్వార్డ్ రేర్ కేమేరా 64+12+5+5 ఎంపీ కెమెరాలతో పాటుగా 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా అద్భుతమైన ఫోటో క్లారిటీ తో తీసుకు వచ్చారు.
ఇక స్టోరేజ్ లో 8జీబీ/128జీబీ లో 512జీబీ వరకూ ఎక్స్పెండ్ చేసుకునే అవకాసం ఉంది. ఇక బ్యాటరీ 4500 ఎంఏహెచ్ + 25 వాట్ సూపర్ ఫాస్ట్ చార్జింగ్ లో యూఎస్ బీ పోర్ట్ టైప్ C తో ఇస్తున్నారు.ప్రోసేసర్ స్నాప్ డ్రాగన్730 (8mm) ఓక్ట్టా కోర్ గేమ్ బూస్టర్ తో వస్తుంది. ఆన్డ్రాయిడ్ ఓఎస్ 10 శాంసంగ్ వన్ యుఐ తో ఇస్తునారు. ఈ ఫోన్ బరువు మొత్తం 180 గ్రామ్స్ ఉండగా ఇది ప్రస్తుతం శాంసంగ్ ఆన్లైన్ స్టోర్ లో దీని ధర 31,500 రూపాయలుగా ఉంది.