ఆ పేరువింటేనే మనకి నవ్వొస్తుంది. కామెడీలో వినూతన రీతిలో సినిమాలు చేస్తూ ఆడియన్స్ ని ఎంటర్టెన్ చేసిన సంపూర్ణేష్ బాబు ప్రస్తుతం కొత్త అవతారం ఎత్తారు. తన భార్యాపిల్లల కోసం కంసాలిగా మారారు. బీ ద రియల్ మెన్ అంటూ పేర్కొంటూ ప్రతి ఒక్కరి మనసును కదిలించే వీడియోను అందరితో పంచుకున్నారు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో సెలబ్రిటీలు Bethe Realman ఛాలెంజ్ విసురుకుంటూ అందరిని ఎంటటైన్ చేస్తున్న విషయం తెలిసిందే.
ఒక్కొక్కరు ఒక్కో విధంగా బి ద రియల్మెన్ ఛాలెంజ్ వీడియోస్ చేస్తున్నారు. ఇప్పటికే పెద్దపెద్దవాళ్ళైన రాజమౌళి, ఎన్టీఆర్ , రాంచరణ్ , చిరంజీవి, కొరటాల శివ, క్రిష్ , బోయపాటి శ్రీను, వెంకటేశ్ ఇలా మొత్తం సినీ ప్రముఖులు తాము లాక్ డౌన్ సందర్భాంగా ఇళ్లల్లో ఎలా సహాయపడుతున్నారో, ఏ పనులు చేసుకుంటున్నారో వాటిని వీడియో చేసి అభిమానులతో పంచుకున్నారు. దాంతోపాటు చాలామందికి తిరిగి ఛాలెంజ్ కూడా విసిరారు.
ఈ నేపథ్యంలో సంపూర్ణేష్ బాబు కంసాలి అవతారం ఎత్తాడు తన భార్యకు కాలి మెట్టెలు, పిల్లలకు గజ్జెలను తయారు చేసి ఇచ్చారు. ఇప్పుడు ఈ వీడియోను సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. దీన్ని ఆయన ఫేస్ బుక్ వాల్ లో పోస్ట్ చేసి అభిమానులతో షేర్ చేసుకున్నారు.అందరు శెభాష్ సంపూ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.