శనివారం, నవంబర్ 26, 2022
Homeసినిమాపూజ హెగ్డే .... సమంత కు క్షమాపణ చెప్పాల్సిందే....

పూజ హెగ్డే …. సమంత కు క్షమాపణ చెప్పాల్సిందే….

తెలుగు ఇండస్ట్రీ లో సమంత కు ఫ్యాన్ ఫాలోయింగ్ భాగా ఎక్కువని మనకు తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు  తన ఫాన్స్ కి ఆమె పై ఉన్న అభిమానాన్ని చూపించుకునే  అవకాశం వచ్చినట్లుంది. ప్రస్తుతం సమంత మరియు పూజ హెగ్డే ఇష్యూ లో తమ సత్తా ఏంటో పూజా హెగ్డేకు రుచి చూపిస్తున్నారు సమంత ఫ్యాన్స్.

సమంతకు తక్షణం పూజా హెగ్డే క్షమాపణ చెప్పాల్సిందేనని చాలా పట్టుబడుతున్నారు. ఈ మేరకు పూజా ట్విట్టర్‌లో పూజా హెగ్డేకు వ్యతిరేకంగా ట్రోల్స్ మరియు ట్వీట్లు చేస్తున్నారు. దీనికి కారణం పూజా హెగ్డే తన  ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో సమంతపై చేసిన కామెంట్. ‘సమంత అందంగా ఉంటుందని నేను అనుకోవడం లేదు’ (I dont find her pretty at all ) అంటూ పూజా హెగ్డే తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. ఇది చూసిన సమంత అభిమానులు ఆ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీని స్క్రీన్ షాట్తో సహా ట్విట్టర్‌లో ఇష్యూ చేయడం  మొదలుపెట్టేసారు.

#PoojaMustApologizeSamantha అనే కొత్త హ్యాష్ ట్యాగ్‌తో పూజా హెగ్డేకు వ్యతిరేకంగా ట్విట్టర్లో ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ హ్యాష్ ట్యాగ్ ఇండియాలో టాప్ ట్విట్టర్ ట్రెండ్ గా మారిపోయింది. అయితే, పూజా హెగ్డే తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ కి గురయ్యిందని పూజా హెగ్డే నిన్న రాత్రి దాటిన తరవాత పూజా హెగ్డే తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. “నా ఇన్‌స్టా అకౌంట్ హ్యాక్‌ అయ్యింది. నేను మరియు మా టీమ్‌కు సమాచారం అందించాను. నా డిజిటల్ టెక్నికల్ టీమ్ దీనిపై పనిచేస్తోంది. దయచేసి ఎలాంటి ఇన్విటేషన్స్ యాక్సెప్ట్ చేయకండి.

మీ పూర్తి వ్యక్తి గత సమాచారానని  కూడా ట్విట్టర్ లో షేర్ చేయకండి’’ అంటూ ట్వీట్‌లో పూజా పేర్కొన్నారు. ఆ తరవాత ఒక గంటకు పూజా ఇంకో ట్వీట్ చేశారు. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ భద్రత కోసం అనేక గంటపాటు చాలా కష్టపడ్డాం. ఇలాంటి సమయంలో తక్షణ సహాయాన్ని అందించిన నా టెక్నికల్ టీమ్‌కి హృదయపూర్వక కృతజ్ఞతలు. చివరికి మళ్లీ నా ఇన్‌స్టాగ్రామ్ నా చేతుల్లోకి వచ్చింది. గడిచిన గంట సమయంలో నా ట్విట్టర్  అకౌంట్ నుంచి ఎలాంటి పోస్ట్‌లు వచ్చినా వాటన్నింటినీ వెంటనే తీసేశాను అని పూజా తన రెండో ట్వీట్‌లో పేర్కొన్నారు.

అయితే పూజా  ఈ ట్వీట్లలో అసలు సమంత పై కామెంట్స్ గురించి ప్రస్తావించకపోవడం ఒక రకంగా అభిమానులకు మరింత ఆగ్రహాన్ని తెప్పించింది. సమంత నటించిన సినిమాలను మరియు పూజా హెగ్డే నటించిన కొన్ని సినిమాలను ఒక దానికొకటి కంపేర్ చేసి, సమంత విజయాలతో చూస్తే నీ సినిమా విజయాలు ఎంత అని పూజాను ఎదురు ప్రశ్నిస్తున్నారు. సమంత ఫ్యాన్స్ తెలుగు మరియు తమిళ అభిమానులు కలిసి ఈ ట్విట్టర్‌లో ఒకరకంగా చెలరేగిపోతున్నారు.

అయితే, మధ్యలో కొంత మంది పూజా హెగ్డే ఫ్యాన్స్ కూడా వీరి మద్య దూరుతున్నారు. దీనిలో పూజా చేసిన తప్పేమీ లేదని, తాను ఎలాంటి క్షమాపణ చెప్పదని ట్వీట్లు చేస్తున్నారు. ఎలాగైతేనేం పూజా హెగ్డే ఇన్‌స్టా పోస్ట్ పెద్ద రచ్చకు తెరలేపింది. ఇదిలా ఉంటే, కొత్తగా సమంత విక్టరీ సింబల్ చూపిస్తూ దిగిన ఒక ఫొటోను ట్వీట్ చేశారు. ఇది ఫ్యాన్స్ ని  కూల్ చేయడానికి చేసిన ట్వీట్‌లా అనిపిస్తోంది.

RELATED ARTICLES

Most Popular