శుక్రవారం, మార్చి 31, 2023
Homeసినిమాసాహసయాత్రకు వెళ్తున్నాం సమంత, నాగచైతన్య

సాహసయాత్రకు వెళ్తున్నాం సమంత, నాగచైతన్య

ప్రస్తుతం టాలివుడ్ టాప్ హీరొయిన్ అంటే సమంతా అనే చెబుతారు ఎందుకంటే ఎలాంటి పాత్రలోనైనా అవలీలగా చేసి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. దీనికి ఉదాహరనే రంగస్థలం, మజలీ, వంటి సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

కొన్నాళ్ళుగా లేడీ ఓరియంట్ సినిమాలు యూటర్న్, ఓబేబీ వంటి వైవిధ్యమైన సినిమాలతో అద్బుత నటన కనబరచిన సమంత కు ఈ సినిమాలు మంచి పేరును కూడా తెచ్చిపెట్టాయి. అయితే ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా సమంత ఇంటివద్దనే ఉంటూ సోషల్ మీడియా వేదికాగా ఫాన్స్ కు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ వస్తుంది.

అయితే ఈ రోజు తన ఫాన్స్ కు మరియు నాగ చైతన్య ఫాన్స్ కు కలిపి ఇన్స్టాగ్రామ్ లో ఒక  ఫోటో అప్లోడ్ చేసింది. దీనిలో కారులో కూర్చున్న సమంత, నాగ చైతన్యతో పాటు ఒక కుక్కపిల్ల కూడా ఆ ఫోటోలో ఉంది.

ఈ పోస్ట్ కి కేప్సన్ గా  “మేము ఒక గొప్ప సాహసయాత్రకు సిద్దమవుతున్నాం” అని పెట్టడంతో ఫ్యాన్స్ ఒక్క సారిగా లాక్ డౌన్ లో సాహసయాత్ర ఏంటబ్బా అని కామెంట్స్ పెట్టగా తీరా చూస్తె ఆ ఫోటో ఒక పాతఫోతో దీనితో ఫ్యాన్స్ అవాక్కయారు. ప్రస్తుతం ఈ ఫోటో ఒక గంటలో పది లక్షలకు పైగా లైక్స్ పొంది సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది.

RELATED ARTICLES

Most Popular