విశాల్ తో అభిమన్యుడు లాంటి త్రిల్లర్ సినిమాలు చేసిన పి.ఎస్ మిత్రన్ దర్సకత్వంలో తెలుగులో “శక్తీ” పేరుమీద రిలీజ్ చేసారు. ఈ సినిమాను రిలీజ్ చేసారు అనడం కంటే ఆన్లైన్ లోకి వదిలేసారని చెప్పడం కరెక్ట్. ఎందుకంటే తెలుగులో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా amazon prime లో ఒక వారం క్రితం దర్సన మిచ్చింది.
ఇక movie relz , movie rockers వంటి online movies website లలో అయితే ఇంకొక అడుగు ముందుకేసి సినిమా రిలీజ్ కాకముందే amazon prime లోకి కూడా రాక ముందే తమ వెబ్సైట్ లలో పెట్టేసారు.
అసలు జరిగిన విషయం ఏమిటంటే తమిళ్ లో రిలీజై న ఈ సినిమాను తెలుగు డబ్బింగ్ చేసి రిలీజ్ చేసే తరుణంలో కరోనా లాక్ డౌన్ ఎఫెక్ట్ తో సినిమా హాల్స్ బంద్ అవ్వగా అదును చూసి movie rulz website లో ఈ సినిమాను పైరసీ చేసి ఆన్లైన్ లో పెట్టేయడంతో ఇక చేసేదేమీ లేక తగినకాడికి ఈ సినిమాను amazon prime కి అమ్ముకోవాల్సిన దుస్థిత తలెత్తింది.
అయితే తమిళ్ లో ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. ఎడ్యుకేషన్ వ్యవస్థలో జరిగే మోసాలపై అద్బుతమైన స్క్రీన్ ప్లే తో తెరకెక్కింది. ఇక ఈ సినిమాపై హీరో శివ కార్తికేయ ఎంతో హోప్స్ పెట్టుకున్నాడు.
ఇంతకముందు వచ్చిన “రెమో”, సూపెర్ హిట్ అవ్వగా శివకార్తికేయ, సమంతా జంటగా నటించిన “సీమరాజా” ఇక్కడ దియేటర్లు దొరక్క యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది.
అయితే పోలీసు యంత్రాంగం online movie websites పై ఎన్ని చర్యలు తీసుకున్న ఏదో రకంగా సబ్ డొమైన్స్ తో మల్లీ సర్వర్లు మార్చి విదేశాలనుంచి కొత్త సినిమాలను పైరసీ చేసి వెబ్ సైట్ లలో పెడుతున్నారు.
ఇక amazon prime లో ఈ సినిమాను చూసిన కొందరు ఒక మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాను దియేటర్లో మిస్సవుతున్నామని ఫీలవుతున్నారు.
అయితే ఈ సినిమాకు డైరెక్టర్ గా పి.ఎస్ మిత్రన్ ఉండగా అర్జున్ లీడ్ రోల్ చేసారు. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించగా కోతపడి రాజేష్ నిర్మాతగా వ్యవహరించారు.