ఆదివారం, జూలై 21, 2024
Homeరాజకీయం10 ఏళ్లలో చెయ్యాల్సిన అభివృద్ధి 3 ఏళ్లలో చేసేసాం ... సజ్జల

10 ఏళ్లలో చెయ్యాల్సిన అభివృద్ధి 3 ఏళ్లలో చేసేసాం … సజ్జల

ఏపీ లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుందంటూ ఇప్పటివరకూ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలపై సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్లాడారు. దేశ వ్యాప్తంగా మరేచోట జరగనన్ని అబివృద్ది కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయంటూ తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఇంతటి అభివృద్ధి జరగాలంటే సుమారు 10 సంవత్సరాలు కశ్చితంగా పడుతుందని కాకపోతే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్లే ఇలాంటి అభివృద్ధి మూడు సంవత్సరాలలోనే సాద్యం అయ్యిందని చెప్పుకొచ్చారు.

అయితే వైసీపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలను మించి అడగని హామీలను కూడా నెరవేర్చామని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం చేసిన సంక్షేమం ప్రజల్లోకి ఆయా ఎమ్మెల్యేలు ఇంటింటికీ వెళ్లి తెలపాలని దిశా నిర్దేశం చేసారు.

ఇదిలా ఉండగా సజ్జల ఇచ్చిన స్టేట్మెంట్ పై తెలుగు తమ్ముళ్ళతో పాటు పలువురు మండిపడుతున్నారు. అసలు ప్రభుత్వం వచ్చి మూడు సంవత్సరాలు అవుతున్నా ఒక్కటంటే ఒక్కటైనా పరిశ్రమ రాష్ట్రానికి వచ్చిందా అంటూ ఉన్న పరిశ్రమలను ఈ ప్రభుత్వం వేదింపులకు గురిచేసి వెల్లగొడుతుందంటూ మండిపడుతున్నారు.

రాష్ట్రంలో యువతకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వని ప్రభుత్వంగా చరిత్ర సృష్టించిందని వాపోతున్నారు. ఇక రాష్ట్ర ప్రజల పరిస్థితి మరీ దయనీయంగా తయారైందని నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానికి అంటుతున్నా, పెట్రోలు ధరలు దేశాలోనే ఎక్కువ వ్యాట్’ వసూలు చేస్తున్న రాష్ట్రాలలో ఏపీ ముందు వరుసలో ఉందని మీరు ప్రజలకు చేస్తున్న సంక్షేమం ఇందేనా అంటూ మండిపడుతున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు నాశనం అయ్యాయని ప్రజల కాళ్ళు, చేతులూ విరుగుతున్నా తీవ్ర ఇబ్బందులు పడుతున్నా  ప్రభుత్వం అవేవీ పట్టనట్టుగా ఉచిత పదకాలంటూ అభివృద్దిని గాలికొదిలేసిందని వైసీపీ ప్రభుత్వం ఈ మూడు సంవత్సరాలలో ఎన్ని కిలోమీటర్ల రోడ్లు వేసిందో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో 10 సవత్సరాల నుండి ఇప్పటివరకూ ఏ ప్రభుత్వమూ పవర్ హాలిడే ఇవ్వలేదని పవర్ హాలిడే ఇచ్చిన ఘనత మీ ప్రభుత్వానిదే అంటూ వేసవి కాలలో ప్రజలు ఉక్కబోతలతో అంధకారంలో మగ్గుతున్నారంటూ విమర్శిస్తున్నారు.

రాష్ట్రాన్ని అప్పుల వూభిలోకి నెట్టి మరో 20 సంవత్సరాల వరకూ కోలుకోలేనంతగా చేసింది కూడా ఈ మూడు సంవత్సరాలలోనే అంటూ ప్రశ్నిస్తునారు. ఇక పదే పదే  హామీలు నెరావేర్చామంటున్న వైసీపీ ఎన్నికలకు ముందు స్పెషల్ స్టేటస్ అంటూ ఎవరి మెడలో వంచుతామంటూ చెప్పారని ఇప్పుడు వారే మెడలు వంచుకుని కూర్చున్నారని, పోలవరం పరీస్థితి ఆ దేవుడికే తెలుసంటున్నారు తమ్ముళ్ళు. ఇంకోసారి వైసీపీ కి అధికారం ఇస్తే ఎవరి పాడె వారే కట్టుకునే పరిస్థితికి ఈ ప్రభుత్వం తీసుకు వెలుతుందని మండిపడుతున్నారు.   

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular