భారత్ గత కొన్నాళ్ళుగా దేశీయంగా 5వ తరం ఫైటర్ జెట్ తయారీలో భాగంగా “ఎడ్వాన్స్ మీడియం కొంబాట్ ఎయిర్ క్రాఫ్ట్” (AMCA) ప్రొజెక్ట్ కార్యరూపం దాల్చింది. ఫైటర్ జెట్స్ యొక్క ఇంజిన్ తయారీకి భారత్ మరియు యూకే దేశాలు మెకిన్ ఇండియా లో భాగంగా ఇండియా లోనే తయారు చేయభోతున్నాయి. ఈ ప్రాజెక్ట్ లో యూకే కి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ రోల్స్ రాయిస్ ఈ ప్రాజెక్ట్ లో భాగం కానుంది. తాజాగా ఈస్ట్ ఏషియాకి సంబందించిన రోల్స్ రాయిస్ వైస్ ప్రెసిడెంట్ ఈ విషయాన్ని వెల్లడించారు.
భారత్ మరియు యూకే పలు మార్లు చర్చల అనంతరం ఇప్పుడు రెండు దేశాల మధ్య చర్చలు చివరి స్టేజ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఇంజన్ కెపాసిటీ 110 KN గా ఉండనుంది. ఇక భారత్ నుండి ప్రైవేటు సెక్టార్ నుండి ఈ అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది. వీటిలో జీటీఆర్ఈ, కళ్యాణీ గ్రూప్స్ తో పాటు ప్రభుత్వ సెక్టార్లోని DRDO వంటి సంస్థలు ఈ ప్రాజెక్ట్ తయారీ లో ముందు వరుసలో వున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రెండు దేశాలూ చేసుకున్న ఎంవోయూ లో భాగంగా ఎయిరో స్పేస్, డిఫెన్స్ సెక్టర్ లో పార్టనర్ షిప్, హార్డ్ వేర్ ట్రాన్స్ఫెరింగ్ మరియు లాంగ్ టర్మ్ టెక్నాలజీ సపోర్ట్, వంటి వాటిపై ఎంవోయూ కుదుర్చుకున్నాయి.
భారత్ చాలా కాలంగా ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి ఈ ప్రాజెక్ట్ ను తలపెట్టింది. ప్రస్తుతం 5వ తరం ఫైటర్ జెట్స్ పై చాలా దేశాలు పనులు మొదలు పెట్టేసాయి. అయితే ఇప్పటివరకూ 5వ తరం ఫైటర్ జెట్స్ ఉన్న దేశాలు అమెరికా, చైనా జపాన్, రష్యా, వంటి దేశాల సరసన భారత్ నిలవనుంది అంతేకాక భారత్ తయారు చేసే ఈ ఫైటర్ జెట్స్ మిగతా దేశాల కన్నా లేటెస్ట్ టెక్నాలజీని దీనిలో పొందు పరచనున్నారు. ఇక భారత్ తయారు చేసే ఈ జెట్స్ ముందు చైనా కు చెందిన 5వ తరం ఫైటర్ జెట్ J-20 దిగదుడుపే.