గురువారం, ఏప్రిల్ 18, 2024
Homeజాతీయంఐటీ కంపెనీల రీ ఓపెన్ పై హైదరాబాద్ పోలీసుల స్పష్టత..

ఐటీ కంపెనీల రీ ఓపెన్ పై హైదరాబాద్ పోలీసుల స్పష్టత..

కరోనా పుణ్యమా అని ఇప్పటి వరకూ సుమారు 45 రోజులుగా అన్నీ మూతపడ్డాయి ఉద్యోగులలో చాలా మంది వర్క్ ఫ్రేమ్ హోమ్ చేసుకున్నారు. ఇంటర్నెట్  ఇబ్బందులతో నెట్ అవ్వక వర్క్ అవ్వక నానా ఇబ్బందులూ పడ్డారు చివరికి ఆ ఇబ్బందులకు నేటితో బ్రేక్ పడింది  ఐటీ కంపెనీలు నేడు తిరిగి స్టార్ట్ కానున్నాయి. అయితే వీరు కొన్ని నిబంధనలు మాత్రం తప్పక పాటించాలి.

ఈ నేపథ్యంలో 33 శాతం స్టాఫ్ ‌‌‌తో హైదరాబాద్‌‌లోని ఐటీ కంపెనీలను మరలా ప్రారంభించుకునేందుకు పోలీసులు అవకాశం ఇచ్చారు. అయితే నిభంధనల్లో భాగంగా ఒక్కో షిఫ్ట్ కి 30 శాతం వర్కర్స్ కాదు అన్ని షిఫ్ట్‌‌‌ల్లో కలిపి 33 శాతం వర్క్ ఫోర్స్ మాత్రమే ఉండాలని కొన్ని నిబంధన పెట్టారు. ఇక ఆఫీస్ టైమింగ్స్ కూడా వారు తెలపడం జరిగింది  ఉదయం 7 గంటలకు వచ్చినవారు  సాయంత్ర  3 గంటలకు బయటికి  వెళ్తారు.

ఉదయం 10 గంటలకు లోపలి వెళితే  సాయంత్రం 6 గంటల వరకూ బయటకు రావాలని తెలిపారు. రాత్రి  7 గంటల తరువాత కర్ఫ్యూ కారణంగా ఎవరూ కూడా బయట తిరగకూడదని నిబంధనలు పెట్టారు. కర్ఫ్యూ విదించిన నేపద్యంలో   సాయంత్రం కూడా 7 గంటల మొదలు ఉదయం 7 గంటల వరకూ ఆంక్షలు ఉంటాయని పోలీసులు తెలిపారు.

ఇండస్ట్రీ బాడీలు ఏఎస్‌‌సీఎస్‌‌సీ, హైసియా, నాస్కామ్‌‌, ఐటీ కంపెనీలకు చెందిన ప్రతినిధులు సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్‌‌‌‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశం అనంతరం ఐటీ సెక్టార్‌‌‌‌కు గైడ్‌‌లైన్స్ ను కూడా జారీ చేశారు.

ఈ నేపథ్యంలో ఉద్యోగుల ట్రావెలింగ్ కు ఇచ్చే అథరైజేషన్ లెటర్లను కేవలం ఇంటి వద్ద నుంచి ఆఫీసుకు, ఆఫీసు నుండి ఇంటికి మాత్రమే ఉపయోగిచాలని పేర్కొన్నారు. ఇక  ఉద్యోగులు వద్ద కంపెనీ ఐడీతో పాటుగా కంపెనీకి చెందిన అథారిటీ లెటర్‌‌‌‌ కూడా తప్పనిసరిగా తీసుకు వెళ్లాలని సూచించారు.

ఇక ఉద్యోగులు ప్రయాణించే క్యాబ్‌లలో డ్రైవర్ మినహా ఇద్దరు మాత్రమే ఉండాలి బస్సుల విషయానికొస్తే  50 శాతం మందికే అనుమతి ఉంటుందని తెలిపారు.  ప్రతేఒక్కరూ మాస్క్ ధరించడం, శానిటైజర్ మరియు హ్యాండ్ వాష్ తప్పనిసరిగా వినియోగించాలని పోలీసులు తెలిపారు.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular