ఆదివారం, నవంబర్ 27, 2022
Homeసినిమాబాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ ఇంట విషాదం.

బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ ఇంట విషాదం.

బాలీవుడ్ లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూయడంతో బాలీవుడ్ తీవ్ర విషాదంలోకి వెళ్ళిపోయింది. అయితే ఆ న్యూస్ నుంచి కోలుకోకుండానే బాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది నటుడు రిషి కపూర్ కన్నుమూయడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ తండ్రి రిషి కపూర్ ముంబైలో కన్నుమూశారు.

హెచ్చెన్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఆయన తుదిశ్వాసవిడిచారు. కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న అయన అమెరికాలో దానికి సంబంధించిన వైద్యం కూడా తీసుకుని ఈ మద్యే ముంబైకి వచ్చారు. అటు రిషి కపూర్ మరణ వార్త విని అమితాబచ్చన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

రిషి కపూర్ 1952,సెప్టెంబర్ 4న జన్మించారు. 1970 లో “మేరా నామ్ జోకర్” సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసారు. 1973 లో “బొబి” సినిమాతో భాలివుడ్ లో అరంగేట్రం చేసారు. తరువాత వరుసగా “కర్జ్”, “ఏవాదారహా”, వంటి సినిమాల్లో నటించారు 1985 లో వచ్చిన “సాగర్” సినిమాలో కమల్ హాసన్ సరసన నటించడం విశేషం. రిషి కపూర్ కన్నుమూయడం భాలివుడ్ కు తీరని లోటనే చెప్పాలి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular