మంగళవారం, నవంబర్ 28, 2023
Homeసినిమాఅనుష్క, త్రిష ల వల్లే రానా లవ్ స్టోరీ సక్సస్ అయ్యిందా...!

అనుష్క, త్రిష ల వల్లే రానా లవ్ స్టోరీ సక్సస్ అయ్యిందా…!

Tollywood updates : ప్రస్తుతం  టాలీవుడ్ హీరోల్లో కొత్తగా పెళ్లి పీటలెక్కే కుర్ర హీరోల సంఖ్య పెద్దగానే ఉంది. వీరిలో నితిన్, నిఖిల్ తో సహా ప్రస్తుతం రానా కూడా వీరి సరసన చేరిపోయాడు. మోస్ట్ ఎలిజిబిల్ బ్యాచిలర్ రానా దగ్గుబాటి త్వరలో ఓ ఇంటివాడు కానున్నాడు.

రానా దగ్గుబాటి తాను చేసుకోబోయే అమ్మాయి మిహికా బజాజ్ ను అందరికీ పరిచయం చేసి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పడంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా అవాక్కయ్యారు. అయితే పెళ్లి డేట్ పై రానా మరియు సురేష్ బాబు కు సోషల్ మీడియా ద్వారా పెళ్లి డేట్ ఎప్పుడో చెప్పాలని మెస్సేజ్ ల వెల్లువ పెరగడంతో సురేష్ బాబు రానా పెళ్లి డిసెంబర్ లో జరుగుతుందని ఒక బాలీవుడ్ న్యూస్ ఛానల్ కు ఇంటర్వ్యూ లో చెప్పారు.

అయితే రానా, మిహికా లు ఒకరికొకరు ఇష్టపడ్డారు పెళ్లి డేట్ డిసెంబర్ కన్నా ముందే ఉండే అవకాశం ఉందని ప్రస్తుతం పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నట్లు సురేష్ బాబు తెలిపారు. అయితే చాలామందికి రానా పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరు ఏం చేస్తుంది  అనే విషయాలను సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మిహికా ముంబై లోని రచనా శంషాద్ ఇన్స్టిట్యూట్ లో ఇంటీరియల్ డిజైన్ లో డిప్లొమా చేసింది. అంతేగాక ఆమెకు ముంబై లోని న్యూడ్రాప్ ఇంటీరియర్ డిజైన్ సంస్థ ఉంది. ప్రస్తుతం బాలీవుడ్ లో జరిగే పారిశ్రామిక వేత్తల వెడ్డింగ్స్,  బర్త్డే పార్టీస్ మొదలగు వాటిని ఈ కంపెనీ నిర్వహిస్తోంది.

అయితే రానా,  మిహికా బజాజ్ ల పరిచయం హీరోయిన్ అనుష్క,  త్రిష ల సాయం తో జరిగింది. త్రిష,  అనుష్క,  మిహికా ఎప్పటినుంచో మంచి ఫ్రెండ్స్. రానాకు వీరితో పరిచయం ఉండడంతో మిహికా,  రానా ల పరిచయం ఏర్పడింది. ముందు స్నేహితులుగా ఉన్న వీరు తరువాత ఒకరినొకరు ఇష్టపడ్డారు.

అయితే మొన్న మిహికా తల్లి బంటి బజాజ్ మదర్స్ డే రోజు వీరి పెళ్ళికి ఒకే చెప్పారు అయితే రానా తండ్రి సురేష్ బాబు కూడా ఒకే చెప్పడంతో  ఇప్పుడు రెండు కుటుంబాలు పెళ్లిబాజాలు మోగించనున్నాయి.

అయితే రానా పెళ్ళికి పెద్దలు ఓకే చేప్పేయడంతో టాలీవుడ్ హీరోలు  ప్రభాస్, ఎన్టీఆర్,  నితిన్, సుదీర్ బాబు, నిఖిల్ వంటివారు కంగ్రాట్స్ తెలుపగా బాలీవుడ్ హీరోలు,  నిర్మాతలు, పారిశ్రామిక వేత్తలు రానా కు కంగ్రాట్స్ తెలిపారు.

అయితే ప్రస్తుతం రానా హౌస్ ఫుల్ 4,  హాథీ మేరీ సాతీ చేస్తుండగా తెలుగులో అరణ్య,  విరాటపర్వం వంటి సినిమాలలో నటిస్తున్నాడు. అయితే రానా అతి త్వరలోనే పెళ్లి పీటలెక్కి ఒక ఇంటి వాడు కావాలని కోరుకుందాం. ప్రజావారధి తరపున “కంగ్రాట్స్ టు దగ్గుబాటి రానా

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular