గురువారం, సెప్టెంబర్ 29, 2022
Homeజాతీయంరాజ్యసభ ఎన్నికలకు డేట్ ఫిక్స్ ....

రాజ్యసభ ఎన్నికలకు డేట్ ఫిక్స్ ….

చాలా రోజులుగా ఆగిపోయిన రాజ్యసభ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఎన్నికల కమీషన్. అయితే వీటిలో చాలా వరకూ ఏకగ్రీవమే అయినా మరికొన్ని చోట్ల మాత్రం ఎన్నికలు నిర్వహించనున్నారు అధికారులు. ఏపీ లో టీడీపీ నేత వర్ల రామయ్య నామినేషన్ వేయడంతో ఎన్నికలు అనివార్యం అయ్యాయి.

అయితే ఈ ఎన్నికలు ఈ నెల 19వ తేదీన ఉదయం 9గంటల నుండి సాయంత్రం 4వరకూ ఈ ఎన్నికలు జరగనున్నాయి. రాజ్యసభ స్థానాలకు ఏపీ నుండి మోపిదేవి వెంకట రమణ, అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోష్ మరియు నఖ్మాని వంటి వారు నామినేషన్ వేశారు.

అయితే ఈ ఎన్నికలు మార్చ్ 26న జరగాల్సిన ఎన్నికలు కరోనా కారణంగా లాక్ డౌన్ విదించడం వల్ల వీటిని వాయిదా వేసింది ఎన్నికల కమీషన్. రాజ్యసభ ఎన్నికలు మొత్తం దేశ వ్యాప్తంగా 17 రాష్ట్రాలలో ఈ ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో చాలా వరకూ ఎకగ్రీవ స్థానాలే ఉన్నా ప్రస్తుతం నిర్వహిస్తున్న సీట్లలో పోటీ ఎక్కువగా ఉండడం వల్ల  ఏకగ్రీవం కాకపోవడంతో ఎన్నికలు నిర్వహిస్తున్నారు.

ప్రస్తుతం ఎన్నికల భరిలో ఏపీ-4, గుజరాత్-4, రాజస్థాన్-3, మధ్యప్రదేశ్-3, జార్ఖండ్-2, మేఘాలయా-1, మణిపూర్-1 మొత్తం 18స్థానాలకు ఈ నెల 19న ఎన్నికలు జరగనున్నాయి. అదేరోజు రాత్రి 9 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది.

RELATED ARTICLES

Most Popular