వామ్మో … సవాల్ విసిరిన దర్శకధీరుడు S S Rajamouli

0
120
Rajamouli be the real man challange
Rajamouli be the real man challange

కరోనా వల్ల లాక్ డౌన్ తో సినిమావాళ్ళకి చాలా పెద్ద గ్యాప్ దొరికింది. ఎప్పుడు సినిమాలంటూ కనీసం ఇంటి పట్టున ఉండే సమయం ఉండదు వాళ్ళకి ఇక S S Rajamouli అయితే సంవత్సరాల తరబడి సెట్స్ లోనే గడిపేస్తాడు. అయితే మెగాఫోన్ పట్టుకుని యాక్షన్ చెప్పే రాజమౌళి చేతిలో చేటా, చీపురు పట్టుకుని ఇంటి పనిలో నిమగ్నమయ్యాడు..

”ఉత్తమ పురుషుడెప్పుడూ ఇంటి పనులను పూర్తిగా భార్య భుజాలపైనే పెట్టడు. ఆమె ప్రతి పనిలో చేదోడు వాదోడుగా నిలుస్తాడు. ముఖ్యంగా ఈ లాక్‌డౌన్‌ కాలంలో ఆమె కోసం ఇంటి పనికి, వంట పనికీ అండగా నిలిచేవాడే నిజమైన మగాడు” అని  సందీప్‌ రెడ్డి వంగా ‘బి ద రియల్‌ మేన్‌’ పేరుతో ట్విట్టర్ వేదికగా రాజమౌళికి ఓ ఛాలెంజ్‌కు విసిరాడు

 ఆ సవాల్‌ను Rajamouli స్వీకరించాడు తన ఇంటిని శుభ్రం చేయడం, తలుపులు, కిటికీలు తుడవడం లాంటి పనులు చేసి రియల్‌ మేన్‌ అనిపించుకున్నారు. జక్కన్న పనులు చేసిన వీడియోను  ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ ఆ సవాల్‌ను రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌లతో పాటు ‘బాహుబలి’ నిర్మాత శోభు యార్లగడ్డ, దర్శకుడు సుకుమార్‌, ఎం.ఎం.కీరవాణిలకు విసిరారు రాజమౌళి. ఆ సవాల్‌ని ఎన్టీఆర్‌ స్వీకరించారు.