July 2, 2020

నువ్వు రాహుల్ గాందీవి కాదు చైనా గాందీవి…అకాళిధల్ నేత

rahul gandhi

rahul gandhi

గాల్వాన్ వ్యాలీ ఘటనపై కేంద్రాన్ని టార్గెట్ చేసిన విపక్ష కాంగ్రెస్ నేతలు గత కొన్ని రోజులుగా ట్విట్టర్ వేదికగా కేంద్రం పై  మరియు ప్రధాని నరేంద్ర మోడీ ని టార్గేట్ చేసి విమర్శలు చేస్తున్నారు. మొన్న ప్రధాని నరేంద్ర మోడీ విపక్ష నాయకులతో వీడియో కాన్ఫెరెన్స్ ఏర్పాటు చేయగా సోనియా గాందీ మోడీ పై పలు విమర్శలు చేసారు. గాల్వాన్ లోయలో తమ తప్పు లేదని, భారత్ ఆక్రమణకు దికుతుందని చైనా భాహాటంగా చెబుతుంటే మోడీ మాత్రం మోనం వహిస్తున్నారని, ఒకవేళ చైనా ఆక్రమిస్తే ఎంత ప్రదేశం అక్రమించిందో చెప్పాలని మోడీ ని విమర్శించారు.

ఇక రాహుల్ గాందీ సైతం మోడీపై నోరు పారేసుకున్నారు. మన జావాన్లు అంత మంది చనిపోవడానికి కారణం బీజేపీనే అంటూ జవాన్లకు తుపాకులు కూడా ఇవ్వకుండా పంపించారా అంటూ మోడీ పై విమర్శలు చేసే ప్రయత్నం చేసారు. అయితే 1996 లో భారత్- చైనా దేశాల మధ్య జరిగిన బోర్డర్ లో “నో ఫైర్” అగ్రిమెంట్ చేసుకున్న రెండు దేశాల మద్య జరిగిన ఒప్పందం కూడా ఆయనకీ తెలియకపోవడం విచిత్రం. రాహుల్ గాందీ ప్రదానిపై నిన్న చేసిన ట్వీట్ బీజేపీ నేతలతో పాటు పలు రాజకీయ నేతలకు ఆగ్రహానికి గురి చేసింది.

“Narendra Modi is actually Surender Modi” అంటూ మోడీపై Rahul gandhi twitter ద్వారా తీవ్ర వ్యాఖ్యలు చేసారు. చైనా కు భారత్ లోగిపోయిందనే అర్ధం వచ్చేటట్లు ఈ ట్వీట్ చేయడంతో రాహుల్ గాందీ పై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. అఖాలిధల్ నేత మంజిందర్ సింగ్ మాట్లాడుతూ రాహుల్ గాందీ ని నువ్వు “రాహుల్ గాందీవి కాదు చైనా గాందీవి” అంటూ విరుచుకుపడ్డారు. అంతేకాక నేడు భారతదేశ నేలపై పుట్టినవారు మొత్తం ఒక్కతాటిపై ఉన్నారని భారత జవాన్లు సైతం ఈ నేలను కాపాడుకోవడానికి వారి ప్రాణాలు ఇచ్చారని. అయితే మనదేశంలోనే కొంతమంది అదును దొరికినప్పుడల్లా వెన్నుపోటు పొడిచే గుణం వారి రక్తంలోనే ఉందని మండిపడ్డారు.

వారు పాకిస్థాన్, చైనా వంటి దేశాలు  భారత్ ను దెబ్బతీయడానికి  వచ్చినప్పుడల్లా ఈ గాందీ కుటుంబం దేశ ప్రజలను మోసం చేయాలనే కంకణం కట్టుకుందన్నారు.  వీరి నీచబుద్ది ఇప్పటికే చాలా సార్లు బయట పడుతూనే ఉందన్నారు. చైనా, పాకిస్థాన్ దేశాలు బారత్ పై దాడికి ప్రయత్నించినప్పుడు మోడీ సొంత నిర్ణయాలు ఉండవని ఒక దేశ ప్రధానిగా మాత్రమె నిర్ణయాలు ఉంటాయని అన్నారు. చైనా తో తలపడుతున్నప్పుడు రాజకీయాలు చేయడం ఆపి దేశం వైపు నిలబడాలన్నారు. దేశంలో గాందీ కుటుంబం మినహా దేశ ప్రజలు మరియు దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు చైనా కు వ్యతిరేకంగా ఒక్కతాటిపై నిలబడ్డాయని విమర్శించారు.

Read more articles…….

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *