Tuesday, October 20, 2020
Home రాజకీయం జగన్ పై 2 లక్షల మార్జిన్ తో గెలుస్తా ..ఇది నా ఓపెన్ చాలెంజ్..రఘురామ కృష్ణం...

జగన్ పై 2 లక్షల మార్జిన్ తో గెలుస్తా ..ఇది నా ఓపెన్ చాలెంజ్..రఘురామ కృష్ణం రాజు

ఒక వైపు న్యాయస్థానాలు మరోవైపు సొంత పార్టీ నేతల వ్యవహారాలూ ఇప్పుడు జగన్ మెడకు కోరివిలా చుట్టుకున్నాయి. వైసీపీ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు గత కొద్ది రోజులుగా సొంత పార్టీ చేస్తున్న అభ్యంతరకర పనులను ఎండగడుతూ వస్తున్నారు.

అలాగే అమరావతి ప్రజలకు తోడుగా నిలిచారు తాజాగా రఘురామ కృష్ణం రాజు చేస్తున్న పనులు వైసీపీ అధిష్టానానికి పంటి క్రింద రాయిలా మారడంతో ఆయన్ని ఇలా వదిలేస్తే తమకి కష్టం అనుకున్నదో ఏమోగాని రఘురామ కు షాక్ ఇవాలని భావించి లోక్ సభ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మెన్ పదవి నుండి రఘురామ కృష్ణంరాజు ని తొలగిస్తూ ఆ పదవిని మచిలీపట్నం ఎంపీ వల్లమనేని బాలశౌరి కి కట్టబెట్టింది వైసీపీ ప్రభుత్వం.

అయితే జగన్ తీసుకున్న ఈ నిర్ణయంపై రఘురామ కృష్ణంరాజు సీరియస్ గా స్పందిస్తూ జగన్ మోహన్ రెడ్డి గారు ఇప్పటివరకూ రెడ్డు లకు పదవుల పంపకాలు పార్తయ్యాయని అందుకే ఇప్పుడు మతాల పరంగా పంపకాలు చేస్తునారని అన్నారు. ఈ పోస్టు నేను ఇచ్చిన ముష్టిగా భావిస్తున్నానని వ్యాఖ్యానించారు.

ఈ పోస్టు ఎవడివల్లో రాలేదని నా పని తనం నా కష్టంతో తెచ్చుకున్నానన్నారు. అంతే కాక 3నెలల క్రితం కొంతమంది వెర్రి సన్నాసులు నన్ను తప్పించి ఇప్పుడు ఇచ్చిన వ్యక్తికి కట్టబెట్టాలని చూసారన్నారు అయితే స్పీకర్ అలా కుదరదు అని అనడంతో ఆగిపోయారని తెలిపారు.

అంతేకాక ప్రజల సొమ్ముతో మా పార్టీ సోషల్ మీడియా వాళ్ళు గుడ్డలూడదీసుకుని డ్యాన్సులు చేస్తూ నా పదవిని పీకేసారని ప్రజల సొమ్ముతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆ పిచ్చిపుష్పాలు నా పదవీ కాలం పూర్తయ్యిందని అది రిన్యూవాల్ టైంలో వేరేవాళ్ళని కూర్చోబెట్టారని ఇప్పటికైనా ఆ పిచ్చ బ్యాచ్ గ్రహించాలని అన్నారు.

నా మంత్రి పదవి నుండి నన్ను డిస్క్వాలిపై చేస్తున్నారని రాతలు రాస్తున్నవారిపై స్పందిస్తూ నేను డైరెక్ట్ గా జగన్ కి చాలెంజ్ విసురుతున్నా.. అమరావతి రెఫరెండం పెట్టి ఎన్నికలకు వెళదాం అంటూ నేను డైరెక్ట్ జగన్ పై పోటీ చేసి 2లక్షల ఓట్ల మార్జిన్ తో గెలుస్తానని ఇది నా ఓపెన్ చాలేంగ్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.       

Most Popular