రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు వైసీపీ ప్రభుత్వం తీరుపై ఆ పార్టీ నేతగా ఉంటూనే విమర్శలతో దుయ్యబట్టే రఘు మరోసారి కొత్త ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఉద్యమంలో మహిళామణులు ముఖ్య భూమిక పోషించాలని అది మన భవిష్యత్తు కాబట్టి సీరియల్స్ చూడటం కట్టిపెట్టి ఇటు ద్రుష్టి పెట్టాలని సూచించారు. ఎంపీ రఘురామ కృష్ణంరాజు నిర్వహించే ‘రచ్చబండ’లో భాగంగా సోమవారం ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని రెఫరెండంగా భావిస్తే తాము ఎన్నికలకు రెడీ అని అయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతే కొనసాగుతుందని ఎంపీ రఘురామ అన్నారు. తను చేసిన ఈ సవాల్ పై ఏమాటలేకుండా వైసీపీ నేతలు పరారయ్యారని అన్నారు.
అమరావతి కోసం 300 రోజులుగా కొనసాగుతున్నా ఉద్యమ నేపథ్యంలో సాదాసీదా కార్యక్రమాల్లా, సినిమా ఫంక్షన్స్ లా కాకుండా ఇదే స్ఫూర్తితో ఉద్యమాన్ని మరింత ఉత్సాహంతో రాష్ట్రవ్యాప్తం చెయ్యాలని పిలుపునిచ్చారాయన. ఇది కేవలం రైతుల సమస్యగా కాకుండా ఆంధ్రప్రజలందరి సమస్యగా, రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మారాలని పునరుర్ఘాటించారు.
అమరావతిలో ఉన్న మహిళలంతా ధైర్యసాహసాలు చూపించాలని, స్త్రీ లు ముందుంటే దేనికైనా శుభం కలుగుతుందన్నారు. అందుకే రాష్ట్రవ్యాప్తంగా మహిళలు కొంచెం సీరియల్స్ చూడంటం తగ్గించాలని, కనీసం 50 శాతం సీరియల్ టైం అయినా తగ్గించుకోవాలని కోరారు. ఏపీ మహిళలంతా అమరావతిపై ఫోకస్ పెట్టాలన్నారు.