ప్రభాస్ “రాదేశ్యామ్” ఫస్ట్ లుక్..ఫేస్ బుక్ లో ఫ్యాన్స్ రచ్చ

radhe shyam first look

భాహుబలి సినిమాతో తెలుగువారి స్టామినాను ప్రపంచానికి తెలియచేసి నేటికి 5 సంవత్సరాలు పూర్తైన తరుణంలో ప్రభాస్ ఫాన్స్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఫస్ట్ లుక్ నేడు రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. దీనిలో ప్రభాస్ రొమాంటిక్ లుక్ లో  స్టైలిష్ మరియు చాల హేండ్సమ్ గా కనిపిస్తుండడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ప్రేమతో ఎగిసిపడుతున్న కెరటంలా ఈ పోస్టర్ ను తీర్చిదిద్దారు. అయితే ఈ సినిమా యూరప్ నేపధ్యంలో సాగే పిరియాడిక్ లవ్ స్టొరీ కావడంతో పోస్టర్ కూడా అద్భుతమైన ఆర్ట్ వర్క్ దీనిలో కనబరిచారు. ఇక ఈ సినిమా పరంగా ఇప్పటి వరకూ ఎలాంటి టైటిల్ ఫిక్స్ చేయకపోవడంతో నేడు పోస్టర్ ద్వారా రాదేశ్యామ్ గా కన్ఫర్మ్ చేసారు.

పోస్టర్ రిలీజ్ చేసిన నాలుగు గంటల్లోనే 1లక్షా 31వేల లైక్స్ తో ఫేస్బుక్ లో దూసుకుపోతోంది. అయితే ఈ సినిమాను గోపీకృష్ణ మూవీస్ మరియు యూవీ క్రియేషన్ సంయుక్తంగా నిర్మిస్తుంటే. ఈ సినిమాను తెలుగు, తమిళ్, హిందీ భాషలలో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే 70శాతం షూటింగ్ పూర్తిచేసుకున్న చిత్ర యూనిట్ తాజాగా రామోజీ ఫిల్మ్ సిటీలో 7కోట్ల తో భారీ బ్రిడ్జి సెట్ను వేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే పోస్టర్ లో మాత్రం 2021 రిలీజ్ అనే క్యాప్సన్ ఉండడం తో వచ్చే ఏడాది జనవరిలో వచ్చే చాన్స్ ఉంది. ఏదేమైనా ప్రభాస్ ఫ్యాన్స్ పోస్టర్ కే ఈ రేంజ్ లో రచ్చ చేస్తుంటే ఇక టీజర్, ట్రైలర్ లకు ఇంకెంత రచ్చ చేస్తారో చూడాలి.


స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి