July 2, 2020

జగన్నాథ రథయాత్ర కు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్-Puri Jagannath Rath Yatra

Puri Jagannath Rath Yatra

Puri Jagannath Rath Yatra

ఒడిశాలోని జరిగే పురి జగన్నాథుని రథయాత్ర కు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. కొన్ని రోజుల క్రితం ఆలయ రథయాత్ర నిలిపివేయాలని ఆదేశాలు జారీచేసింది. ఇప్పుడు కొన్ని నిబంధనలతో రథయాత్ర జరుపుకోవచ్చని తెలిపింది. జూన్ 18 న ఇచ్చిన తీర్పు ను సవరించిన సుప్రీం కోర్టు కొవిడ్ దృష్ట్యా భక్తులు పాల్గొనకుండా రథయాత్ర నిర్వహించుకోవచ్చు అని సూచించింది. రథయాత్రను కచ్చితంగా ప్రత్యక్ష ప్రసారం చేయాలని  అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.

జగన్నాథుని రథోత్సవం | Puri Jagannath Rath Yatra

ప్రపంచంలోనే అతి పెద్దది అయిన ఈ రధయాత్ర రంగు రంగు లతో అందరినీ ఆకర్షిస్తూ ప్రపంచాన్నంతా తన దగ్గరకు తెచ్చుకునేటువంటి  రథయాత్రే పురి  జగన్నాథుని రథయాత్ర. పురి జగన్నాథుని ఆలయం అంటే  మనకు గుర్తుకొచ్చేది ఆశాడం లో వచ్చే ఆ జగన్నాథుని రథోత్సవం. ఆషాఢ శుక్ల విదియనాడు పాండాలు మేళతాళాలతో ఉదయకాల పూజలు నిర్వహించి ‘మనిమా’ (జగన్నాథా…) అంటూ పెద్దపెట్టున నినాదాలు చేస్తూ విగ్రహాల్ని కదిలిస్తారు. ఆనందబజారు, అరుణస్తంభం మీదుగా అత్యంత కోలాహల వాతావరణంలో ఊరేగిస్తూ రథం వెనక భాగం నుంచి తీసుకువచ్చి రత్నపీఠం మీద అలంకరింపజేస్తారు. ఈ ఉత్సవాన్ని ‘పహండీ’ అంటారు.

Puri Jagannath Rath Yatra – ప్రత్యకతలు:

ఏదైనా చాల పెద్దఎత్తున ఊరేగింపు జరిగితే జగన్నాథ రథయాత్రే అని అంటూ ఉంటారు. ఈ రథోత్సవానికి అంత ప్రత్యకత రావటానికి కారణం ఎక్కడ లేని కొన్ని ప్రత్యేకతలు జగన్నాథుడు కొలివైనటువంటి పురోషోత్తమ పూరి  అని ప్రసిద్ది చెందినటువంటి క్షేత్రం లో  ఉన్నాయి. ఇక్కడ ఈ క్షేత్రనికి  ప్రాధాన్యం తో పాటు  దైవానికి ప్రాధాన్యం ఉంది. సాధారణంగా క్షేత్రాలలో దేవుళ్ళకి కానీ  నదులకి కానీ సరస్సుల కి కానీ సముద్రానికి కానీ ప్రాధాన్యత ఉంటుంది. కానీ ఇక్కడ ఈ రెండిటికీ  సమ ప్రాధాన్యత ఉంటుంది. అంతే కాకుండా పూరి లో అన్ని ప్రత్యేకతలే ఎక్కడా లేనటువంటి ప్రత్యేకతలు ఇక్కడ ఆశ్చర్యకరమైన విశేషం ఏమిటంటే ఎక్కడైనా దైవముర్తి పక్కన ఎవరు ఉంటారు ఆయన భార్య  ఉంటుంది కానీ.. పూరీలో మాత్రం జగన్నాథుని పక్కన భలభద్రుడు, సోదరి సుభద్ర కనపడతారు. ఇలా ఎక్కడ లేనటువంటి ప్రత్యకతలు పూరి లో మనకి కనపడతాయి.

అంటే చెల్లెలిని పక్కన పెట్టుకున్న ఏకైక ఆలయం ఎక్కడ ఉంది అంటే కేవలం ఆ జగన్నాథుని కొలువై ఉన్న పూరి లో మాత్రమే. ఇంకా ఎక్కడైనా  చెల్లెలు సుభద్ర కి ఆలయాలు ఉన్నాయా..? ఎక్కడ లేవు. మూల పీఠం మీద తనతో పాటు గా తన సోదరుడిని, సోదరిని అధివసింప చేసిన అటువంటి ఏకైక క్షేత్రం పూరి క్షేత్రం. దీనికి నీలజలం అనే పేరు కూడా ఉంది. ఇంకా పూరి లో ప్రత్యేకతలు ఏంటంటే.. సాధారణంగా ఏ క్షేత్రాలలోనైన ఉత్సవాల కు కానీ ఊరేగింపు కానీ ఉత్సవ విగ్రహాలని మాత్రమే ఊరేగిస్తారు అవి వేరుగా ఉంటాయి..దేవుళ్ళ ఊరేగింపు కి మూల విరాట్టుడైన విగ్రహాన్ని అల ఆ ముల పీఠం వద్దే ఉంచి వేరే చిన్న విగ్రహాలను ఊరేగిస్తారు. కానీ పూరి లో మాత్రం మూల విరాట్ అయిన జగన్నాథుడు వారి సోదరీ, సోదరుడు ముగ్గురు కూడా తరలి వస్తారు. అంతే కాకుండా ఇక్కడ ఏ ఉత్సవాలు జరిగినా, అభిషేకాలు జరిగినా ఇలా మూల పీఠం మీద ఉన్న ఈ ముగ్గురికి నిర్వహిస్తారు. శ్రీ కృష్ణుడు ఉత్తమ పురుషునిగా తన జీవితాన్ని ఎలా వెళ్ళదిశాడో ఇక్కడ జరిగేటటువంటి ఉత్సవాలు చెప్తునాయి.

ఉత్తముడైన మానవుడు తన భార్య కి ప్రాధాన్యత ఇవ్వడమె కాకుండా తనతో పాటు తల్లిదండ్రులకి సోదరీ, సోదరులకి బంధువులకు కూడా ప్రాధాన్యత ఇస్తాడు. అలాగే గర్భ గుడిలో మూల పీఠం మీద తనతో పాటు తన అన్నని, చెల్లెలిని కూర్చోబెట్టుకొవడమే కాకుండా ఇయన తన పినతండ్రి ఇంటికి యాత్ర గా వెళ్తాడు. ఈ  గుండిచా మండపానికి వెళ్లి అక్కడ ఆ పినతల్లి పెట్టేటువంటి (తియ్యనైన పదార్థం) హోడపిటి అనే పదార్థాన్ని తిని వస్తాడు. గుండిచా ఆలయానికి వెళ్ళడానికి సిద్ధమైన సుభద్ర, జగన్నాథ, బలభద్రులు రథారూఢులై ఉండగా ‘ఇలపై నడిచే విష్ణువు’గా గౌరవాభిమానాల్ని అందుకునే పూరీ రాజు పల్లకీలో అచ్చటికి చేరుకోవడంతో సంభరాలు మిన్నంటుతాయి. సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండిచా ఆలయానికి చేరుకోవడానికి 12 గంటల సమయం పడుతుంది. స్వామి అక్కడ ఏడురోజుల పాటూ ఉంటాడు. వారంపాటు గుండిచాదేవి ఆతిథ్యం స్వీకరించిన సుభద్ర, జగన్నాథ, బలభద్రులు దశమినాడు తిరుగు ప్రయాణం చేస్తారు. దీన్ని ‘బహుదాయాత్ర’ అంటారు. అంత కోలాహలంగా జరుగుతుంది ఆ జగన్నాథుని రథోత్సవం.

ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మానవులు ఎంత గొప్పవారైన సరే తమ బంధుత్వాన్ని మర్చిపోకూడదు.   జగన్నాథుడు మాత్రం దారిలో ‘అర్థాసని’ (‘మౌసీ మా’గా ప్రసిద్ధి) గుడి వద్ద ఆగి తియ్యటి ప్రసాదాల్ని స్వీకరిస్తాడు. ఇక్కడ రతయత్రే కాదు స్వామి వారి ప్రసాదం కూడా ప్రత్యకతే.. పూరి జగన్నాథుని కి అరు దఫాలు గా నైవేద్యాన్ని అందిస్తారు. ఇందుకోసం 56 పదార్దాలను తయారు చేస్తారు. అది కూడా నిత్యం మట్టి కుండల్లో తయారు చేస్తారు. శ్రీకృష్ణుడు గోవర్ధనగిరినీ 7 రోజుల పాటు తన చిటికెన వేలు మీద నిలిపి ఉంచడాట. ఆ 7 రోజులు కూడా అన్నపానీయాలు ఏమి ముట్టుకోలేదు అప్పుడు భక్తులందరూ 8వ రోజున  వారానికి సరిపడ ప్రసాదాన్ని ఒకేసారి స్వామికి సమర్పించారట.

ఆనాడు శ్రీకృష్ణడికి 56 ఆహారపదార్థాలు అందించారు కబ్బట్టే ఇప్పుడు అదే రీతిలో ఉపచారం జరుగుతుందని ఓ నమ్మకం. అక్కడ ఆ వంటలు చేయడానికి 30 పైగా గదులు, 600 కి పైగా వంట మనుషులు ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి అతి పెద్ద వంటశాలగా పూరి  పేరుగాంచింది. ఇక్కడ లక్ష కు పైగా భక్తులకు వంట చేయగలరు. అక్కడ 56 వంటకాలకు విశేష ప్రచారం తీసుకొచ్చింది ఆదిశంకరులు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఆ ప్రసాదాలు భగవంతుడికి నివేదించే వరకు ఎలాంటి వాసనా రాదంట కానీ ఆ జగన్నాథుని కి నైవేద్యం సమర్పించిన వెంటనే ఆ వంటలు అన్ని గుమ గుమా లడే సువాసనలు వెదజల్లుతయంట.

ఇంకా ఆశాడంలో అయితే పెద్ద ఎత్తున జరిగే ఈ ఉత్సవనికి ముగ్గురికి కూడా ప్రత్యేకంగా రథాలు ఉన్నాయి. ముందుగా చెల్లి సుభద్ర రథం బయలుదేరుతుంది తర్వాత అన్న బలరాముడు రథం బయలుదేరుతుంది ఆ తర్వాత ఆ జగన్నాథుని రథం బయలుదేరుతుంది. ఆ రథానికి ఉన్న తాళ్ళు పట్టుకుని లాగడానికి ఎంత మంది ముందుకొస్తారో చెప్పలేము. రథానికున్న తాళ్లను లాగడం వలన ప్రపంచ ప్రఖ్యాత రథయాత్ర ఆ సమయంలో స్వామిని ‘పతితపావనుడు’ గా భావిస్తారు. ఆ తొక్కిసలాటలో ప్రాణం పోయిన జన్మ దన్యం అనుకుంటారు తప్ప దాని గురించి వెనకాడరు. మధ్యాహ్నానికి మూడు రథాలూ ఆలయానికి చేరుకుంటాయి. మరుసటి రోజు, ఏకాదశినాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతో (సునాబెష) అలంకరించి దర్శనానికి అనుమతిస్తారు ఆ దృశ్యం ఆమోగం. ద్వాదశినాడు మళ్లీ విగ్రహాలను రత్నసింహాసనంపై ప్రతిష్ఠించడంతో రథయాత్ర పూర్తవుతుంది. స్వామిలేక చిన్నబోయిన పూరీ, జగన్నాథుడి రాకతో కొత్తకళ సంతరించుకుంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *