శనివారం, ఏప్రిల్ 20, 2024
Homeరాజకీయంవైసీపీ ఎమ్మెల్యేలను చీకోడుతున్న జనం...జగన్ ఏపీ అసంబ్లీ రద్దు చేసే ఆలోచనలో ఉన్నారా?

వైసీపీ ఎమ్మెల్యేలను చీకోడుతున్న జనం…జగన్ ఏపీ అసంబ్లీ రద్దు చేసే ఆలోచనలో ఉన్నారా?

telugu news: ఏపీలో రాజకీయ సెగ ఇప్పుడిప్పుడే రాజుకుంటుంది వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలకు పైగా గడిచిన తరుణంలో జగన్ ఆదేశాలతో తమ ప్రభుత్వం చేసిన సంక్షేమ పధకాలు ప్రజలకు తెలిసేలా గడప గడపకూ వైసీపీ పేరుతో మంత్రులు అందరూ ఇకపై వారి నియోజక వర్గంలోనే ప్రతీ ఇంటికీ తిరగాలంటూ ఆదేశించడంతో మంత్రులు ఇంటింటికీ తిరిగి వైసీపీ ప్రభుత్వం చేసిన సంక్షేమం గురించి ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసారు మంత్రులు. అయితే ప్రతీ నియోజక వర్గంలోనూ మంత్రులు తిరిగిన ప్రతీ చోటా ఎదురు దెబ్బే తగిలింది.

మంత్రుల తీరుపై ప్రజల ఆగ్రహం

చాలా చోట్ల గ్రామాలలో ఉన్న సమస్యల గురించి, ఆగిపోయిన అబివృద్ది, పెంక్షన్ సమస్యలు, గ్రామాలలో ఆగిన అబివృద్ది పై ప్రజలు దైర్యంగా అడుగుతుండడంతో ఇచ్చిన డబ్బుల గురించి చెబుతున్నారే తప్ప గ్రామాలలో ఉన్న సమస్యలపై మంత్రులు నోరు మెదపడం లేదు. దీనితో  ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అక్కడినుండి మెల్లగా జారుకుంటున్నారు. ప్రతీ చోటా ఇలా ప్రజలనుండి వ్యతిరేకత రావడంతో దీనిని కాస్త బస్సు యాత్రగా మరల్చారు అయితే ఈ బస్సు యాత్ర అంతకంటే గోరమైన అట్టర్ ప్లాప్ గా నిలిచింది.

వైసీపీ మంత్రులకు ఎదురుదెబ్బ

ఈ బస్సు యాత్రలో చాలా వరకూ వీక్షకులు వాలంటీర్లు, పోలీసులే తప్ప పట్టుమని వంద మంది కూడా దాటడం లేదు. అయితే ఈ బస్సు యాత్ర కోసం రద్దీ కూడళ్ళలో గంటలకొద్దీ ట్రాఫిక్ ఆంక్షలు పెట్టి సాధారణ ప్రజలను ఇబ్బందులు పెడుతూ ఈ సభలను నిర్వహిస్తున్నా జనం మాత్రం లేక మంత్రులు కాళీ కుర్చీలకు స్పీచ్ లు ఇస్తున్నారు. పలు చోట్ల జాతీయ రహదారులను కూడా ఈ సబల కోసం వదలడంలేదు. నిన్న నంద్యాలలో జరిగిన వైసీపీ మంత్రుల సభలో వైసీపీ మంత్రి మాట్లాడు తుండగా వచ్చిన వంద మందీ అక్కడినుండి లేచి వెళ్ళిపోయారు చివరికి కాళీ కుర్చీలే మిగిలినా మంత్రి గారు మాత్రం స్పీచ్ ఆపకపోవడంతో ఆ పక్కనే ఉన్న బొత్స సత్యనారాయణ ఇక చాలు అక్కడ ఎవ్వరూ లేరు మనం వెళ్ళిపోదామని సదరు మంత్రికి చెప్పడంతో ఆ సభను అర్ధాంతరంగా ఆపేశారు.

టీడీపీ మహానాడు భారీ సక్సెస్ పై జగన్ కు అందిన రిపోర్ట్

టీడీపీ నిర్వహించిన మహానాడు సభ కనీ వినీ ఎరుగని రీతిలో భారీ సక్సెస్ అయ్యింది. మహానాడుకు అనేక అడ్డంకులు సృష్టించి దానిని ఎలాగైనా నిర్వీర్యం చెయ్యాలని చూసిన వైసీపీ కి దిమ్మతిరుగే జనంతో టీడీపీ ఇప్పటివరకూ ఏ మహానాడుకూ రానంత జనం రావడం విశేషం. ఇప్పటికే మహానాడు సక్సెస్ అవ్వడంతో జగన్ కు దీనిపై రిపోర్ట్ అందినట్లు తెలుస్తోంది. ఒక వైపు టీడీపీ ప్రజల్లో తన పూర్వ వైభావాన్ని సంతరించుకుంటుంటే వైసీపీకి ప్రజల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత మూటగట్టుకుంది. దీనితో జగన్ ప్రభుత్వం త్వరలో అసెంబ్లీ రద్దు దిశగా అడుగులు వేస్తారనే వార్త రాజకీయ విశ్లేషకుల నుండి వినిపిస్తోంది.  

ఇది కూడా చదవండి:  చివరికి జగన్ ప్రయాణం “అమ్మఒడి” లోకేనా  

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular