బుధవారం, అక్టోబర్ 4, 2023
Homeసినిమాప్రభాస్ పాన్ ఇండియా స్టార్ కాదు వరల్డ్ వైడ్ స్టార్

ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ కాదు వరల్డ్ వైడ్ స్టార్

పాన్ ఇండియా మూవీగా వస్తున్న ప్రభాస్ మూవీలో బిగ్ స్టార్స్ ఎంటరవుతూనే ఉన్నారు..నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో సైన్స్ ఫిక్ష‌న్ చిత్రంగా ఓ వైపు  ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో ఆదిపురుష్ గా మరోవైపు  భారీ చిత్రాలతో అతి భారీ బ‌డ్జెట్ చిత్రాలు చేస్తున్నాడు మన రెబల్ స్టార్.

దీంతో తెలుగు సినిమా హీరోగా మన ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేస్తున్నాడు. బాహుబలి సినిమాతో మొదలైన ఈ నేషనల్ స్టార్ ఇమేజ్ రాబోయే రోజుల్లో వరల్డ్ స్టార్ గా మారబోతుందా. ఈ చిత్రాల‌పై అభిమానుల‌లో అయితే  అంచ‌నాలు కేక పుట్టిస్తున్నాయి. ప్ర‌భాస్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ సినిమాకి చెందిన  క్రేజీ అప్‌డేట్స్ అక్టోబర్ లో వారానికి ఒకటి రానున్నాయి అని సమాచారం.

ఈ నేపథ్యంలోనే అక్టోబర్ 9 న నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీలో  రెబల్ స్టార్ హీరోగా తెర‌కెక్క‌నున్న సంగతి తెలుసు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్టుకి సూపర్ అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు మూవీ టీం. ఈ మూవీలో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బ‌చ్చ‌న్ నటిస్తున్నారని, కీల‌క పాత్ర పోషించ‌నున్నట్టు టీం పేర్కొన్నారు.

ఇండియన్ సూపర్ యాక్టర్ ప్ర‌ముఖ నటుడు లేకుండా ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం ఎలా చేస్తాం అంటూ వీడియో రిలీజ్ చేసింది చిత్ర బ్రుందం. ఈ వీడియో ద్వారా అమితాబ్ బ‌చ్చ‌న్ మూవీలో ప్ర‌ముఖ పాత్ర పోషిస్తున్న‌ట్టు ప్ర‌కటించారు. అయితే  సుమారు 500 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో దీపికా ప‌దుకొణే హీరోయిన్ గా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

WhatsApp Group Join Now
RELATED ARTICLES
- Advertisment -

Most Popular