యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రాలలో ఆదిపురుష్ ఒకటి. ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని టెక్నికల్ యూనిట్ ఇప్పటికే గ్రాఫిక్స్ వర్క్స్ పై ద్రుష్టి పెట్టిన విషయం తెలిసిందే అయితే ఆదిపురుష్ సినిమాలో ఉపయోగించే గ్రాఫిక్స్ విషయాలపై ఫ్యాన్స్ లో పలు అనుమానాలు కలుగుతున్నాయి.
ఆదిపురుష్ సినిమాకి ఉయోగిస్తున్న టెక్నాలజీ
ఎక్ష్కెన్స్ మోసన్ కేప్చర్ మరియు ఫేసియల్ కేప్చుర్” (Xsens motion capture and facial capture) టెక్నాలజీతో ఆదిపురుష్ చిత్రాన్ని విజువల్ వండర్ గా ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని అందించనుంది ఆదిపురుష్ చిత్ర యూనిట్.
అసలు చిక్కు ఇక్కడే వచ్చిపడింది.సాధారణంగా మోసన్ కేప్చర్, ఫేసియల్ కేప్చుర్ అనే టెక్నాలజీని హాలివుడ్ సినిమాలలో ఎక్కువగా వాడహారు. ఉదాహరణకు “Avatar”, “The Lord of The Rings”, “The Avangers” వంటి సినిమాలకు ఈ మోసన్ కేప్చర్, ఫేసియల్ కేప్చుర్ అనే టెక్నాలజీని ఉపయోగించిన విషయం తెలిసిందే.
మోసన్ కేప్చర్, ఫేసియల్ కేప్చుర్ అంటే ఏమిటి ?
ఈ టెక్నాలజీతో గ్రాఫిక్స్ ద్వారా ఒక హీరోకి లేదా ఒక జంతువుని గ్రాఫిక్స్ ద్వారా శరీరాన్ని తయారు చేస్తారు. ఇలా తయారు చేసిన శరీరానికి టెక్నికల్ టీం వారు వారి ముఖానికి ఫేసియల్ కేప్చుర్ కు సంబంధించిన డివైజెస్, కెమెరాలను పెట్టుకుని గ్రీన్ మ్యాట్ లో యాక్టింగ్ చేస్తారు అంతేకాక వారి ముఖ కదళికళను కేప్చర్ చేసి ఆ డేటా హీరోకి లేదా ఒక జంతువుకు గ్రాఫిక్స్ ద్వారా తయారు చేసిన శరీరంలోకి ట్రాన్స్ఫర్ చేస్తారు దీని ద్వారా ఆ హీరో శరీరంలో కదలికను తెప్పిస్తారు.

మోసన్ కేప్చర్, ఫేసియల్ కేప్చుర్ పై ప్రభాస్ ఫ్యాన్స్ లో అనుమానాలు
ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ చిత్రం ఇదే టెక్నాలజీతో వస్తుండడంతో ఫ్యాన్స్ కు పలు అనుమానాలు కలుగుతున్నాయి. అసలు ప్రభాస్ ను రాముడిగా ఒరిజినల్ శరీరంతో చూపిస్తారా లేక మోషన్ టేక్నాలతో చేసిన గ్రాఫిక్స్ రూపంలో చూపిస్తారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఒకవేళ గ్రాఫిక్స్ తో చూపిస్తే ఎన్నాళ్ళగానో ప్రభాస్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు నిరాశే అని చెప్పాలి.

ఇప్పటివరకూ ఈ టెక్నాలజీ ఉపయోగించిన ఇండియన్ సినిమాలు
హాలివుడ్ లో ఈ టెక్నాలజీ ఇప్పుడు సుమారు ప్రతీ సినిమాలోనూ ఉపయోగిస్తున్నారు. అయితే ఇండియా లో ఇప్పటివరకూ ఈ మోసన్ కేప్చర్, ఫేసియల్ కేప్చుర్ టెక్నాలజీతో వచ్చిన సినిమాలు చాలా తక్కువే అవి రజనీకాంత్ నటించిన “కొచ్చాడయాన్” ఆర్య నటించిన “టెడ్డీ” అనే సినిమాలతో పాటు మరో రెండు సినిమాలలో మాత్రమే ఈ తెక్నాలకీని ఉపయోగించారు.
ఇండియాలో పెద్దగా ప్రాచుర్యం పొందని మోషన్ టెక్నాలజీ
భారీ బడ్జెట్ తో నిర్మించిన “కొచ్చాడయాన్” ఇక్కడి ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక పోయింది. దీనికి ప్రధాన కారణం ఫ్యాన్స్ తమ హీరోని కళ్లారా చూద్దామని వస్తే అక్కడ హీరో శరీరం ఒక గ్రాఫిక్స్ రూపంలో కనిపించడంతో ఫ్యాన్స్ నిరాస చెందారు.
Adipurush Budjet
ఇక ఆదిపురుష్ విషయానికి వస్తే రామాయణం లో హనుమంతుడు, వానర మూఖ (కోతులు) వంటి వాటికి ఈ మోసన్ కేప్చర్, ఫేసియల్ కేప్చుర్ టెక్నాలజీ ఎలాగూ ఉపయోగిస్తారు వీటికోసమే ఈ టెక్నాలజీ ఉపయోగిస్తారా లేదా అనేది చూడాలి. ఇక ఈ సినిమా 550 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో సుమారు 15 భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా 20 వేల దియేటర్లలో రిలీజ్ చేయనున్నారు.
ఇవిచదవండి
- Adipurush first look | ప్రభాస్ ఫ్యాన్స్ కు పండగే ఆదిపురుష్ ఫస్ట్ లుక్ ఎప్పుడో తెలుసా
- నేను కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభాస్, యూవీ క్రియేషన్స్ నన్ను ఆదుకున్నారు అందుకే ఇలా చేశా…తమన్