మంగళవారం, నవంబర్ 28, 2023
Homeరాజకీయంఏపీ లో మరోసారి స్కూల్స్ ప్రారంభం వాయిదా

ఏపీ లో మరోసారి స్కూల్స్ ప్రారంభం వాయిదా

ఏపీ లో కరోనా తీవ్రత దృష్ట్యా ఇప్పటికే పలుమార్లు వాయిదాపడ్డ విద్యాసంస్థలు, ప్రభుత్వ పాఠశాలలు మరోసారి వాయిదా పడ్డాయి. అక్టోబర్ 5న పాఠశాలలను తెరవాలని చూసింది జగన్ సర్కార్. అయితే గతంలో కేంద్ర ప్రభుత్వం మాత్రం తాము చెప్పేవరకూ విద్యాసంస్థలను తెరవవద్దని పలు  సూచనలు చేసింది. అయితే కేంద్రం తాజాగా  విద్యాసంస్థల ప్రారంభం ఆయారాష్ట్రాలదే పూర్తి బాద్యత అంటూ నిర్ణయం ఆయారాష్ట్రాలకే వదిలేసినట్లు తెలుస్తోంది.

అయితే రాష్ట్రంలో ఉన్న కేసులు మరియు మరణాల దృష్ట్యా విద్యార్ధుల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని మరో నెల రోజుల పాటు పొడిగిస్తూ నవంబర్ 2న స్కూల్స్ తెరవాలని భావిస్తోంది. ఇక ఇంటర్మీడియట్ విషయానికొస్తే ఈ ఏడాది ఈ అడ్మిసన్స్ లో ఎలాట్మెంట్ అనే కొత్త విదానాన్ని తీసుకు వచ్చింది. అయితే ఈ నెల 28వ తేదీ నుండి ఈ ఆన్లైన్ అడ్మిసన్స్ ఓపెన్ చేస్తున్నట్లు తెలిపిన ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకూ ఆన్లైన్ అడ్మిసన్స్ ఓపెన్ కాకపోవడంతో ఇంటర్మీడియట్ సెప్టెంబర్ లో తెరుస్తారా లేక నవంబర్ 2నే తెరుస్తారా అనే సందేహం విద్యార్దుల్లో నెలకొంది.

ఇక ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలలో బాగంగా విద్యాదీవెనను అక్టోబర్ 5న రాష్ట్రంలో ఏదోఒక ప్రభుత్వ పాఠశాలలో జగన్ ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్ధులకు విద్యాదీవెనను ఇచ్చే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక నాడు నేడు లో భాగంగా ఎపీలోని ప్రభుత్వ పాఠశాలలను అదునీకరణ ఇప్పటికే చాలా వరకూ పూర్తికావచ్చాయి.        

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular