మంగళవారం, నవంబర్ 28, 2023
Homeజాతీయంప్రకాశం జిల్లా నాటు సారా పై పోలీసుల వరుస దాడులు

ప్రకాశం జిల్లా నాటు సారా పై పోలీసుల వరుస దాడులు

గిద్దలూరు మండల SI సమందర్ వలి నాటుసారా పై తనదైన శైలిలో వరుస దాడులు నిర్వహిస్తున్నారు.  ఇందులో భాగంగా బుధవారం మండలంలోని జయరాంపురం తండా, బురుజుపల్లి తండా సమీపంలోని అటవీ ప్రాంతంలో నాటుసారా తయారు చేసేందుకు సిద్ధంగా ఉంచిన 2800 వందల లీటర్ల బెల్లపు ఊట ను గిద్దలూరు SI సమందర్ వలి గుర్తించి ధ్వంసం చేశారు.

40 లీటర్ల నాటుసారా ను స్వాధీనం చేసుకొని, ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.ఈ సందర్భంగా SI సమందర్ మాట్లాడుతూ.. నాటుసారా తయారు చేయటం అమ్మటం నేరమని, అటువంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఎవరైనా సరే నాటుసారా తయారు చేస్తున్నా, అమ్ముతున్నా సమాచారం అందించాలన్నారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని గిద్దలూరు SI సమందర్ వలి తెలిపారు.

ప్రస్తుతం రాష్ట్రం లో కరోనా ప్రభావం తో లాక్ డౌన్ కారణంగా మద్యం సేవించే వారు ఇప్పుడు మద్యం దొరక్క అల్లాడిపోతున్నారు. కొన్ని చోట్ల వింత ప్రవర్తనతో వ్యవహరిస్తున్నారు. తెలంగాణా లో పలు చోట్ల మద్యం దొరక్క ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కొన్నిరోజులుగా చూస్తూనే ఉన్నాం.

అయితే ఇదే అదునుగా చేసుకుని ఏపీ లోని పలు చోట్ల పోలీసులు రాలేని నిర్మానుష్య ప్రాంతాల్లో నాటు సారా కాస్తున్నారు. ఈ నాటుసారా సాధారణంగా బెల్లంతో తయారు చేస్తారు. ప్రస్తుతం ప్రభుత్వం బెల్లం కొనుగోళ్లను నిషేదించింది.

దీనితో బెల్లం దొరక్క పంచదారతో ఈ నాటు సారా తయారు చేస్తున్నారు. బెల్లం తో పోల్చితే పంచాదారతో చేసిన నాటుసారా వల్ల ప్రాణాలకు పెను ముప్పుగా మారుతుంది.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular