బుధవారం, అక్టోబర్ 4, 2023
Homeజాతీయం83 మంది విదేశీ తబ్లిగీలపై ఛార్జ్ షీట్..ఉచ్చుబిగిస్తున్న పోలీసులు.

83 మంది విదేశీ తబ్లిగీలపై ఛార్జ్ షీట్..ఉచ్చుబిగిస్తున్న పోలీసులు.

భారతదేశంలో కరోనా కేసులు స్వల్పంగా ఉన్న సమయంలో ఢిల్లీలో తబ్లిగి ప్రార్ధనల వల్ల ఒక్కసారిగా భారత్ లో కేసులు పెరిగిన సంగతి మనకు తెలిసిందే. దేశంలోని నలుమూలల నుంచి ఢిల్లీకి వెళ్లి అక్కడి మత ప్రార్థనలలో పాల్గొన్న చాలా మందికి కరోనా వైరస్ సోకడంతో అది దేశంలోని నలుమూలలకూ వ్యాపించి అన్నిచోట్లకు విస్తరించింది.

ఈ నేపథ్యంలో ఢిల్లీ తబ్లిగి జమాత్ సభ్యులపై క్రైమ్ బ్రాంచి పోలీసులు నిఘా పెంచారు వారిపై క్రమేపి ఉచ్చు బిగిస్తున్నారు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. ఇప్పటికే జమాత్ చీఫ్ ఐన మౌలానా సాద్ సహచరులైన అయిదుగురి పాస్ పోర్టులను మరియు వారి వద్ద ఉన్న డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.

ఇప్పటివరకూ  83 మంది విదేశీ సభ్యులపై 20 ఛార్జి షీట్లను సైతం సాకేత్ కోర్టులో దాఖలు చేయనున్నట్లు  తెలుస్తోంది. ఈ మత ప్రార్థనల్లో పాల్గొన్నవారిలో 10 మంది సౌదీ అరేబియాకు మరియు  ఎనిమిది మంది బ్రెజిల్ కు చెందినవారు ఉన్నారు. వీరంతా  ఈ సంవత్సరం మార్చి నెలలో  ఢిల్లీ నగరంలోని నిజాముద్దీన్ మర్కజ్ లో జరిగిన మతపరమైన ప్రార్థనల్లో  హాజరైనవారిలో వీరు  కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పుడిప్పుడే  దేశంలో కరోనా విస్తరిస్తున్న తరుణంలో అసలు  నలుగురికి మించి ఎవరూ గుమికూడదన్న నిషేధాజ్ఞలకు, నిబంధనలకు విరుద్ధంగా వీళ్ళంతా మర్కజ్ ప్రోగ్రామ్ కి హాజరయ్యారన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా వీళ్లపై ఉన్నాయి. ఇక జమాత్ లో సభ్యత్వం కలిగిన  ప్రతీ విదేశీయులనీ పోలీసులు ఇంటరాగేషన్ చేసినట్టు ఈ పని ఇప్పటికే పూర్తైనట్టు పోలీసులు వెల్లడించారు.

అయితే వీళ్ళు మౌలానా  సూచనల్ మేరకు తాము మార్చి 20 తరువాత కూడా మర్కజ్ లో ఉన్నామని ఈ విదేశీయుల్లో కొందరు  తెలుపుతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే మర్కజ్ కు సంబంధం ఉన్న అనేక బ్యాంకు అకౌంట్లను కూడా పోలీసులు జల్లెడ పడుతున్నారు.

పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో కొన్ని  విషయాలు కనుగొన్నారు పోలీసులు పలు గల్ఫ్ కంట్రీస్ నుండి ఈ సంస్థకు నిధులు అందుతున్న విషయాన్ని  వారు గుర్తించారు. ఇదే సమయంలో ఈ నెల 5 వ తేదీన మౌలానా తనయుడిని పోలీసులు ప్రశ్నించి మార్చి మొదటి వారంలో మతపరమైన కార్యక్రమాలకు ఎవరెవరు అటెండ్ అయ్యారన్న విషయాన్ని,  అలాగే మేనేజింగ్ కమిటీతో వీరికి ఏమైనా సంబంధం ఉందా అన్న విషయాల్ని కూడా తెలుసుకున్నారు.

మొత్తంగా చూస్తే నిజాముద్దీన్ మత ప్రార్థనల కోసం ఆక్కడ 1640 మంది విదేశీ తబ్లిగి జమాత్  సభ్యులు ఉన్నట్టు అంతేకాక ఈనెల 15 వ తేదీన ‘జమియాథ్-ఉలేమా-ఏ-హింద్’ అనే ముస్లిం సంస్థ తెలిపింది.

వీరంతా 47 దేశాలకు చెందిన వారని ఆ సంస్థ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదానీ తెలిపారు. అయితే అన్ని దేశాలనుంచి వచ్చిన ఈ సభ్యుల్లో 64 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్టు తేలిందని, వీళ్లల్లో ఇద్దరు మరణించారని మౌలానా అర్షద్ మదానీ తెలిపారు.

దేశంలో కరోనా కేసుల గురించి ప్రస్తావన బయటికి తెచ్చినప్పుడు జమాత్ అంశాలను కూడా హైలైట్ చేయడంతో ముస్లిముల పట్ల ఒకరకమైన ద్వేష భావం పెరగడానికి అది దారి తీసిందని ఆయన అన్నారు.

WhatsApp Group Join Now
RELATED ARTICLES
- Advertisment -

Most Popular