ఆదివారం, జూలై 21, 2024
Homeసినిమానిహారిక భర్త చైతన్యపై న్యూసెన్స్ చేసాడంటూ పిర్యాదు.

నిహారిక భర్త చైతన్యపై న్యూసెన్స్ చేసాడంటూ పిర్యాదు.

మెగా డాటర్ నీహారికా గత ఏడాది చివర్లో మెగా కాంపౌండ్ సమక్షంలో అంగరంగ వైభవంగా నిహారిక చైతన్యల పెళ్ళి జరిగిన విషయం తెలిసిందే. పెళ్ళి అనంతరం ఒక అపార్ట్మెంట్ లో ఉంటున్న నిహారికా-చైతన్యలు తాజాగా అపార్ట్మెంట్ లో ఉంటున్న కొందరు చైతన్యపై బంజారాహిల్స్  పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయడంతో తాజాగా కొత్త విషయం వెలుగులోకి వచ్చింది.

పూర్తి వివరాలలోకి వెళితే గత కొన్నాళ్ళుగా నిహారికా మరియు చైతన్య ఒక అపార్ట్మెంట్ లో ఉంటున్నారు అయితే వారు ఉంటున్న అపార్ట్మెంట్ లో ఒక వైపు ఆఫీసు సెటప్ చెయ్యాలనే ప్రయత్నం చెయ్యగా ఆ అపార్ట్మెంట్ లో ఉంటున్న కొందరు ఇక్కడ ఆఫీస్ పెట్టడానికి వీలు లేదంటూ చైతన్యతో గొడవకు దిగారు. ఇద్దరి మద్యా మాటా మాటా పెరగటంతో ఈ వివాదం బంజారాహిల్స్ లో ఒకరిపై ఒకరు కంప్లైంట్ ఇచ్చుకునే వరకూ వెళ్ళింది.

అయితే అపార్ట్మెంట్ వాసులు పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్ లో చైతన్య ఉంటున్న అపార్ట్మెంట్ కి అర్ధరాత్రి మద్యం తాగి కొందరు యువకులు చైతన్య ఉంటున్న అపార్ట్మెంట్ లో పెద్ద పెద్ద అరుపులతో నానా హంగామా చేస్తునారని అందుకే జూబ్లిహిల్స్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాక అపార్ట్మెంట్ వాసులకు మరియు చైతన్యకు  మద్య అనేక సార్లు గొడవలు కూడా జరిగాయని తెలుస్తోంది.

ఇక ఈ విషయం పై బంజారాహిల్స్ పోలీసులు అపార్ట్మెంట్ కు సంబంధించి సీసీ కెమారాల పుటేజ్ ను పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. అంతే కాక అపార్ట్మెంట్ వాసులకు మరియు చైతన్యకు మద్య పోలీసులు రాజీ కుదుర్చినట్లు తెలుస్తోంది.

Also Read….బోనాల సంభారాలతో కళకళ లాడుతున్న భాగ్యనగరం | Bonalu 2021

 

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular