జమాత్ సభ్యుల అనుచిత ప్రవర్తన పై పోలీసుల కేసు నమోదు

0
148
telugu news tabilge jamaat
telugu news tabilge jamaat

ఘజియాబాద్ : తబ్లిగి జమాత్ సభ్యుల అనుచిత ప్రవర్తన పై పోలీసుల కేసు నమోదు

ఘజియాబాద్ : తబ్లిగి జమాత్ సభ్యులు కొన్ని రోజుల క్రితం ఢిల్లీ ప్రార్ధనలకు వెల్లినవారికి అక్కడ కరోనా సోకడంతో  ప్రభుత్వం వీరికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసేందుకు ఉత్తర్ ప్రదేశ్ , ఘజియాబాద్ లోని ఓ ప్రభుత్వ ఐసోలేషన్ కి వీరిని తరలించారు.

కాగా అక్కడ జమాత్ సభ్యులు కొందరు ఆ ఆస్పత్రి ప్రాంగణంలో కలియ తిరుగుతూ అక్కడి  పరసరాల్లో అర్ధనగ్నంగా తిరగటం, నర్సింగ్ సిబ్బంది పై సమీపంలో అసభ్యంగా కామెంట్స్ చెయ్యడం, వారి పై ఉమ్మడం వంటి చర్యలకు పాల్పడినట్టు అక్కడ ఉన్న మహిళా పోలీసులు వివరించారు.

అంతేకాకుండా తమను సిగరెట్లు  తీసుకురావాలని  కొందరు వ్యక్తులు పదేపదే  డిమాండ్ చేస్తున్నారన్నారు. వారికి కావాల్సిన ఆహారాన్ని తెచ్చి ఇవ్వాల్సిందిగా డిమాండు చేస్తున్నారని దీనితో ఏమిచెయ్యాలో తెలియక ఆస్పత్రి సిబ్బంది చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ కు ఫిర్యాదు చేయడంతో అక్కడ మొత్తం మగవారినే నియమించిది.

కొందరు తీవ్ర ఆరోపణలు, అసభ్యకరంగా ప్రవర్తించిన వారిపై తగు చర్యలు తీసుకుంటామని యోగి అడిత్యనాద్  ప్రభుత్వం తెలిపింది. వీరిపై బద్రతా చట్టం కింద కేసులు నమోదు చేస్తామనారు.

ప్రాణాలకు తెగించి మీకు సేవచేసే వారిపై ఇలాంటి ప్రవర్తనలు హేయమైన చర్యగా అభివర్ణించారు. ఐసోలేషన్ లో చికిత్సపొందితున్న వీరు వైద్య సిబ్బంది, మహిళా పోలీసులు, నర్సుల ముందు అర్ధ నగ్నంగా తిరగడం, పలు మార్లు గర్శనలకు దిగుతుండడంతో అక్కడకు సీఆర్పీఎఫ్ జవాన్లను పంపిచారు.

అయితే అనుచిత ప్రవర్తన, స్త్రీలను అగౌరవపరచడం , అంటువ్యాదులు ఇతరులకు సోకే విదంగా ప్రవర్తించడం వంటి నేరాలకు పాల్పడినందువల్ల  వారిపై పలు కేసులు నమోదు చేసి ఈ ఘటన మొత్తం జిల్లా మేజిస్ట్రేట్, ఎస్పీ స్తాయి అధికారి విచారణ చేపట్టారు.