సోమవారం, ఫిబ్రవరి 6, 2023
Homeఅంతర్జాతీయంచైనాలో కరోనా వైరస్ ను ఇతరులకు అంటిస్తున్న వ్యక్తులు భయంకర నిజాలు

చైనాలో కరోనా వైరస్ ను ఇతరులకు అంటిస్తున్న వ్యక్తులు భయంకర నిజాలు

ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న మహమ్మారి కరోనా వైరస్ ఇది మొదట చైనాలో పుట్టి తాజాగా తొంభై ఆరు దేశాలకు పాకింది. ఈ వైరస్ సోకినా వారిలో ఏడు నుండి తొమ్మిది రోజులలో దీని లక్షణాలు బయట పడుతున్నాయి ఇది సోకినా పది నుండి ఇరవై రోజుల లోపు శరీరం లోని కిడ్నీ మరియు లివర్ వంటి వాటికి ఈ వైరస్ సోకి చనిపోతున్నారు.

అయితే చైనాలో వైరస్ సోకిందని అనుమానం వచ్చిన కొంత మంది ప్రజలు తాము చనిపోతామనే ఈర్షతో ఆ వైరస్ ను ఇతరులకు అంటిస్తున్నారు.

caronavirus in chaina
caronavirus in chaina

తాజాగా చైనా నిఘా కెమెరాలకు కొన్ని భయంకర నిజాలు వెలుగులోకి వచ్చాయి ఇప్పుడా వీడియో అందర్నీ షాక్ కి గురి చేస్తుంది. ఈ వీడియోలో ఉన్న వారిలో కొంత మంది జనం వద్ద నిల్చుని వారి దగ్గరగా దగ్గడం, ఎదుటి వారితో కరచాలనం వంటివి చేస్తూ ఈ వీడియోలో దొరికారు. అయితే ఒకవ్యక్తి ఇంకొక అడుగు ముందుకేసి తాను వెళ్తున్న లిఫ్ట్ లో ఉన్న నంబర్స్ కు తన నోటిలో spit (ఉమ్ము) ఆ నంబర్స్ పై అంటిస్తూ కనిపించాడు.

అయితే చైనా ప్రభుత్వం ఈ సమస్యను ఎలా అధిగమించాలో తెలియక తలపట్టుకుంటుoది అసలే చైనా ఆర్ధిక పరిస్థితి కుదేలైంది ప్రజలు రోడ్లపైకి రావడానికి బయపడుతున్నారు అక్కడి స్టాక్ మార్కెట్లు ఎన్నడూ చూడని నష్టాలను చవిచూసింది.

ఆటో మొబైల్ రంగం అయితే మళ్ళీ కోలుకోవడానికి ఆరు నెలలు పడుతుంది. ఇప్పుడు తాజాగా ఈ మహమ్మారి భారత్ కు కూడా చేరింది ఇప్పటిదాకా భారత్ లో 39 కేసులు నమోదయ్యాయి ఇక్కడి వేడి వాతావరణానికి వైరస్ వ్యాపించడం కష్టమే అయినా చైనా మరియు ఇటలీ ఫ్రాన్స్ వంటి దేశాలనుండి వచ్చిన వారిలో ఈ వైరస్ ఉండడంతో వారిని ఆయా హాస్పటల్స్ కు తరలిస్తున్నారు.

బయటి దేశాలనుండి వచ్చె వారికి విమానాశ్రయంలో స్క్రీనింగ్ టెస్ట్ చేసాక వారిని విడిచి పెడుతున్నారు. ఇలాంటి టైంలో కూడా కొన్ని మెడికల్ షాప్లు మాస్కులు మరియు సానిటైజర్ల ధరలు పెంచి డబ్బులు సొమ్ము చేసుకుంటున్నారు.

RELATED ARTICLES

Most Popular