మానవ శరీరానికి రోగ నిరోధక శక్తిని అందించే ఉత్తమమైన ప్రక్రియ నిద్ర. శరీరం, మెదడు ఆరోగ్యానికి ప్రశాంతమైన నిద్ర చాలా అవసరం. రాత్రి సమయంలో తగినంత నిద్రపోవడం వల్ల వైరస్ నుంచి రక్షించుకోవచ్చు కరోనా మీద భయం తో చాలామందికి నిద్రపట్టడంలేదు. ఏ చిన్న అలసట వచ్చినా కరోనా ప్రభావం అనుకుంటూ శరోరంలో జరిగే అతిచిన్న మార్పులకు కూడా వైరస్ అంటూ భయపడుతున్నారు చాలామంది దీనివల్ల నిద్రకూడా సరిగ్గాపట్టడంలేదంటూ చెబుతున్నారు.
ఇలా ఆందోళన చెందటం మంచిది కాదు మీరు స్వీయనిర్బందంలో ఉన్నన్నిరోజులు ఏం కాదు. కొన్నిరోజులు గుమిగూడకుండా జాగ్రత్తగా ఉండాలి, ప్రతీ రెండుగంటలకు చేతులు కడుక్కోవాలి. ఇక కారోనా భయం తో నిద్ర పట్టనివాళ్ళు ఇలా చెయ్యండి. నిద్ర అనేది ఒక దివ్య ఔషధం . అందువల్ల రాత్రి పూట ప్రశాంతంగా నిద్రపోవడం ఎంతైనా అవసరం దీనికి అవసరమయ్యే కొన్ని చిట్కాలను నిపుణులు సూచిస్తున్నారు.. కరోనా నిరోధానికి ప్రస్తుతం లాక్డౌన్ నడుస్తోంది .
మరోవైపు వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలు స్వీయ నిర్బంధంలో ఉంటున్నారు. దీంతో ఎప్పుడుబడితే అప్పుడు నిద్రకు ఉపక్రమిస్తున్నారు. ఎక్కువగా పగటి పూట నడుం వాల్చడం (కునుకుతీయడం) వల్ల రోజంతా నిద్రమత్తు ఉంటుంది. ఇది వేళకు నిద్రించే అలవాటుపై దుష్ప్రభావాన్న చూపుతుంది. వ్యాయామం తప్పనిసరిగా చెయ్యాలి లాక్ డౌన్ నేపథ్యంలో జిమ్‌లు మూసే ఉన్నాయి. అయినాసరే రోజూ వ్యాయామం తప్పనిసరిగా చేసుకోవాలి.
వేళకు నిద్రించడంలో వ్యాయామం పాత్ర ఎనలేనిది. ఇలా చేస్తున్నా ఆందోళన తగ్గకుండా సరిగా నిద్రపట్టకపోతే డాక్టర్ ని సంప్రదించండి. ఏవైనా ఇబ్బందులు ఉంటే మీ స్నేహితులతో షేర్ చేసుకోండి . వారితో మనస్ఫూర్తిగా మాట్లాడండి. సన్నిహితుల సాయం తీసుకోండి. మీరు ఒంటరి కాదన్న విషయం ఎప్పుడూ గుర్తుంచుకోండి. సుఖంగా నిద్రించండి ఆరోగ్యాంగా ఉండండి