పదిమందికీ ఆదర్శప్రాయులు ఈ పెన్మెత్స దంపతులు

0
130
Penmetsa Nagaraju & nagasailaja
Penmetsa Nagaraju & Naga Sailaja

ఇలాంటి కష్ట కాలంలో చిరుసాయం సుమారు వెయ్యి మందికి నిత్యావసర సరుకుల పంపిణీ చేసిన ఆత్రేయపురం నాగరాజు దంపతులు.

ఎలాంటి వారైనా కష్ట కాలంలో తోటి వారికి తమకు తోచిన సాయం అందించే వారు నిజమైన మానవత్వం అనిపించుకుంటుంది. ఒకరికి సమస్య వచ్చినప్పుడే నేనున్నానని తోటి వారికి ధైర్యాన్ని ఇస్తూ చేతనైనంత సాయం అందించే మానవత్వం అందరితో కొనియాడబడుతుంది. ఆ కోవకే వీరు వస్తారు. ఒకప్పుడు వీరు ఆర్థికంగా చితికిపోయారు.  ఎన్నో కష్టాలని చవి చూసిన వీరు ప్రస్తుతం   కాస్త స్థిరపడ్డారు.

లాక్ డౌన్ వేళ తమ చుట్టూ ఉన్న చాలా మందికి ఆదాయం లేక  పడుతున్న అనేక ఇబ్బందులను చూసి వారికి ఎలాగైనా తమ వంతు సాయం అందించాలని ఆ దంపతులు ముందుకు వచ్చారు. వారే ఆత్రేయపురానికి చెందిన పెనుమత్స నాగరాజు, అరుణ నాగ శైలజ. వీరు సుమారు రూ. 6 లక్షల రూపాయలతో ఆర్దికంగా ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులకు నిత్యావసరాలను కొనుగోలు చేసి ఉచితంగా పంపిణీ చేశారు.

వీటిలో నాణ్యమైన 10 కేజీల బియ్యం, కేజీ కంది పప్పు, కేజీ నూనె వంటి సరుకులు వారికి అందించారు. కరోనా జీవితాలను తలకిందులు చేస్తున్న తరుణంలో పేద కుటుంబాలకు ఆదరణగా నిలిచారు. ఆత్రేయపురం గ్రామంలో లో సుమారు 1000 కుటుంబాలకు ఈ నిత్యావసరాలను వీరు  పంపిణీ చేసారు వీరు అందిస్తున్న సేవలను మండలంలోని ప్రజలు అభినందిస్తున్నారు.

ప్రస్తుత పరిస్థితి చూస్తే ఒకప్పుడు తాము పడిన కష్టాలు కళ్ళకు గుర్తుకొచ్చాయి అని తాము నాడు పడిన వేదన తన తోటి వారు పడకూడదనే ఉద్దేశ్యంతో ఇలాంటి పని  చేసామన్నారు. ఇదేవిధంగా ప్రతీ ఒక్కరూ తమకు చేతనైన సాయం చేయండి.