Narsapuram : పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో బాగంగా నిన్న మల్కీపురంలో బహిరంగ సమావేశం నిర్వహించిన పవన్ నేడు నర్సాపురం లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఉదయం నుండి నర్సాపురం మొత్తం పవన్ అభిమానులతో నాలుగు రోడ్ల బస్టాండ్ కూడళ్ళు కోలాహలంగా మారిపోయింది. నర్సాపురం విచ్చేసిన జనసేన అధినేత పవన్ కు నర్సాపుర వాసులు దారి పొడవునా సాదర స్వాగతం పలికారు.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తన చిన్న తనంలో చీరాలకు వెళుతున్న సమయంలో తన తండ్రి నర్సాపురం బస్టాండ్ బస్టాండ్ వద్ద ఉంచగా అక్కడ తాను తప్పిపోయానని తరువాత ఎవరో తనను తీసుకువెళ్ళి తన తండ్రికి అప్పజెప్పారని లేకపోతే ఇప్పటికీ ఇక్కడే నరసాపురంలో ఎక్కడో తిరుగుతుండేవాడినని ఆయితే నేను తప్పిపోయినా ఇక్కేడే ఉండి సమస్యలపై పోరాటం చేసేవాడినని తన చిన్ననాటి జ్ఞాపకాన్ని తెలిపారు.
తనకి ఈ దేశం, నేల, నావాలన్నా, నామనుసులన్నా నాకు అదొక పిచ్చి అంటూ తెలిపారు. ఇప్పుడున్న నాయకులు సిగ్గువదిలేసి భూతులు తిడుతూ దిగజారిపోయి మాట్లాడుతున్నారని అన్నారు. ప్రతీ మనిషికీ కావలసిన త్రాగడానికి నీరు, ఉండడానికి ఇల్లు, విద్య, గాలి వంటి వాటితో పాటు ఆడవారికి మాన ప్రాణాలతో ఉండడం ప్రాధమిక హక్కన్నారు ఇలాంటివి లేని రోజు ప్రజలు పోరాటాలు చేస్తారని తెలిపారు. అమలాపురంలో స్కూల్ బాలికలు బాత్రూమ్ లేక బాధపడుతూ తన దగ్గరిక రావాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు.
పవన్ ప్రభుత్వ తీరుపై మాట్లాడుతూ రాష్ట్రాన్ని, రాష్ట్ర వనరులను మీరు మీ మంత్రి వర్గమే లూటీ చేస్తున్నారని అన్నారు. కోట్ల మంది సంపాదన టాక్స్ రూపంలో ప్రభుత్వ కజానాకు వస్తుంటే అది కొంత మందికి పంచేసి వోట్ల కోసం మిగతా వాళ్ళ శ్రమను దోచుకుంటున్నారని అన్నారు. అంతేకాక అవినీతి ప్రతీ ఒక్కరి జీవితంలో ఒక బాగంగా మార్చేశారని అన్నారు. నేను కూడా ఏదైనా మీటింగ్ పెట్టాలంటే పర్మిషన్ ఇవ్వకపోతే నేను కూడా లంచం ఇవ్వాల్సివస్తుందని లేకపోతే పనులు అవ్వవని అన్నారు.