శుక్రవారం, మార్చి 29, 2024
Homeఅంతర్జాతీయంపాకిస్థాన్ లో దారుణం... హిందూ దంపతులను

పాకిస్థాన్ లో దారుణం… హిందూ దంపతులను

దాయాది దేశం పాకిస్థాన్ లో ఉన్న దారుణాలు, అక్రమాలూ అన్నీ ఇన్నీ కావు అక్కడ అంతా ఒక రకమైన నియంత పాలన ఉంటుంది. ఆ దేశ రాజకీయ నాయకులు ఉండేది పేర్లకే అక్కడ మొత్తం అజమాయిషీ  సైన్యం చెప్పుచేతల్లో మొత్తం వ్యవహారం నడుస్తుందంటే విచిత్రం లేదు.

ఉగ్ర మూకలు అక్కడి ప్రభుత్వాలను కొంచెం కూడా లెక్కచేయవు ఒకరకంగా చెప్పాలంటే అక్కడి  ప్రభుత్వ వ్యవస్థలే వాళ్ళను పెంచి పోషించాయి. ఇక  ఆ దేశంలో చేసే  అత్యంత హేయమైన చర్యలు మైనార్టీలుగా జీవిస్తున్న అక్కడి హిందువులు మరియు ముస్లిమేతరులపై వారు దాడులు చేయడం. అనేకసార్లు దీనిపై మనదేశం గొంతెత్తినా అక్కడ ఆగడాలు ఒక్కటి కూడా ఆగడం లేదు.

వారు చేస్తున్న అక్రమాలు దాడులు వారిపై ఆగకపోగా అక్కడుండే  ముస్లిమేతరులను బలవంతంగా ఇస్లాంలోకి మత మార్పిడి యదేచ్చగా చేస్తున్నారు. వీరిలో అత్యధికంగా  హిందువులు, సిక్కులు, క్రైస్తవులు ఎక్కువగా ఉండే సింధ్ ప్రావిన్స్ ప్రాంతంలో  రోజూ ఎదోమూల వీరిపై  బలవంతపు మతమార్పిడులు కొనసాగుతూనే ఉన్నాయి.

అయితే నేడు తాజాగా  సింధ్ ప్రావిన్స్ లోని నవాబ్షా సమీపంలో ఓ హిందూ దంపతులను బలవంతంగా అక్కడి నాయకులు ఇస్లాం మతం లోకి మతమార్పిడి చేశారు. అక్కడే స్థానిక  మసీదులో ఈ మత మార్పిడి వ్యవహారం అంతా జరిగింది.

అయినా సరే అక్కడి నాయకులలో ఒక్కరు కూడా నోరు మెదపలేదు. అయితే పాకిస్తాన్‌లోని ముస్లిం మత సంస్థ అయిన జమాత్ అహ్లే సున్నత్ అనే నాయకుడు కూడా ఈ బలవంతపు మతమార్పిడి కార్యక్రమంలో పాల్గొన్నట్లు స్థానిక మీడియా తెలిపింది.

అయితే అక్కడ ఎప్పుడూ ఇలాంటి ఘటనలు ఇప్పటికే చాలా సార్లు  చోటుచేసుకుంటున్నా సరే అక్కడ వీటిపై కఠిన చట్టాలు లేకపోవడం వాళ్ళ రాజకీయ వ్యవస్థకే ఇది సిగ్గుచేటు. ఈ ప్రాంతంలో ప్రతీ ఏడాదీ అక్కడ నివసించే హిందూ అమ్మాయిలను బలవంతంగా ఎత్తుకెళ్ళి  వారిని బెదిరించి హింసించి వివాహం చేసుకుని వాళ్ళను బలవంతంగా మతమార్పిడి చేస్తున్నారు అక్కడి స్థానిక ముస్లిం యువకులు.

ఈ నేపథ్యంలో అక్కడ ప్రతి సంవత్సరం దాదాపు వెయ్యి మందికి పైగా హిందూ అమ్మాయిలు ఇలాంటి అపహరణలకు గురవుతున్నట్లు సమాచారం. వీరంతా సుమారు 12 సంవత్సరాల వయస్సు నుండి 28 సంవత్సరాల వయస్సు లోపు వారే కావడం బాదాకరం.

ఇప్పటికైనా దీనికి ముగింపు కావాలని తాము ప్రశాంతంగా జీవించలేకపోతున్నామని అక్కడి హిందువులు ఎప్పటినుంచో పోరాడుతున్నారు. కానీ అక్కడి ప్రభుత్వాలు మాత్రం వాళ్ళని కొంచెం కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. ఇన్ని దురాగతాలు వారిపై  జరుగుతున్నా అక్కడ నివసించే హిందువులు మాత్రం వారి నమ్మకాలను కోనసాగించడం వదులుకోకుండా జీవించడం నిజంగా గర్వకారణం.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular