శుక్రవారం, ఏప్రిల్ 19, 2024
Homeఅంతర్జాతీయంమూర్ఖపు ఆలోచన చేసిన పాక్..లాక్ డౌన్ ఎత్తివేత అక్కడ అంతా రిస్క్ ...

మూర్ఖపు ఆలోచన చేసిన పాక్..లాక్ డౌన్ ఎత్తివేత అక్కడ అంతా రిస్క్ …

కరోనాని నియంత్రించి ప్రజలను ఎలా కాపాడుకోవాలా అని భారత్ ఆలోచిస్తోంది. ప్రజలప్రాణాలకంటే  ప్రస్తుతం డబ్బు ముఖ్యం కాదంటూ లాక్ డౌన్ విధించి కట్టుదిట్టమైన చర్యలు తోసుకుంటోంది. ఇక ఇదే విధంగా కోవిడ్-19 ను నిర్ములించే దిశగా  అన్ని దేశాలు లాక్​డౌన్ అమలు చేస్తున్నాయి. కానీ ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా దాయాది దేశం పాకిస్థాన్ మాత్రం శనివారం లాక్​డౌన్​ను ఎత్తేసింది. ఇప్పటికే అక్కడ వైరస్ చాపకింద నీరులా విస్తరించింది 28,000 వైరస్ కేసులు నమోదవ్వగా 618 మంది ప్రాణాలు గాల్లోకలిసిపోయాయి.

ఇవేమీ పట్టనట్లు పాకిస్థాన్​ మాత్రం లాక్​డౌన్​ను ఎత్తేసింది. ఆంక్షల ఎత్తి వేతతో వైరస్​ కేసులు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని  నిపుణులు హెచ్చరిస్తున్నారు.కానీ దాయాది మాత్రం వారి అభిప్రాయాన్ని పక్కన పెట్టి తాజా చర్యలకు దిగింది. ఇక పాక్ తీసుకున్న ఆంక్షల సడలింపుపై ఇప్పటికే ప్రభుత్వాన్ని వైద్యులు హెచ్చరించారు. పాకిస్థాన్ మెడికల్ అసోసియేషన్ తరఫున ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. మేం కేసుల సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నాం.

కరాచీలోని ఆస్పత్రిలో కేవలం 63 పడకలనే కరోనా వార్డుకోసం సిద్ధం చేశారు. కరాచీ లాంటి నగరంలోనే పరిస్థితే ఇలా ఉంటే మిగతా చోట్ల ఎలా ఉందో ఊహించుకోవచ్చు. ఇక పాక్ మెడికల్ అసోసియేషన్ మాత్రం ఇవేం లెక్కచేయడంలేదు ఓ వైపు కేసులు రోజురోజుకూ పెరుగుతుండగానే అక్కడ లాక్​డౌన్ తీసివేసింది పాక్. పాక్​ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular