ఆదివారం, జూలై 21, 2024
Homeఅంతర్జాతీయంపాకిస్థాన్ లో విమానం కూలి 107 మంది మృతి ..

పాకిస్థాన్ లో విమానం కూలి 107 మంది మృతి ..

లాక్​డౌన్​లో  కొన్ని సడలింపులు ఇస్తూ విమానాలకు అనుమతించింది పాకిస్థాన్. అయితే ఇది జరిగిన  వారం రోజులకే​ కరాచీ లో ఘోర ప్రమాదం జరిగింది. అందులోని మొత్తం 107 మంది ప్రాణాలు కోల్పోయారు.

జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గరలో ఉండే నివాస ప్రాంతంలో పాక్​ అంతర్జాతీయ ఎయిర్​ లైన్స్​ కు చెందిన ఏ-320 విమానం కుప్పకూలింది. లాహోర్​ నుండి వస్తున్న పీకే 8303 విమానం కరాచీ విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వాలి.

కానీ ల్యాండ్ అవ్వడానికి ​కొద్ది సేపటి ముందే విమానం కుప్పకూలిపోయింది. ఈ సమయంలో విమానంలో మొత్తం 99 మంది ప్రయాణికులు ఉన్నారు వీరితోపాటు 8 మంది విమాన సిబ్బంది ఉన్నట్టు అధికారులు తెలియజేశారు.

రాడార్​తో సంబంధాలు తెగిపోయే ముందు ల్యాండింగ్​ గేర్​లో సమస్యలు తలెత్తినట్లు కెప్టెన్​ ఎయిర్​ ట్రాఫిక్​ టవర్​కు సమాచారం ఇచ్చాడు. రెండు విమానాశ్రయాలు అందుబాటులో ఉన్నాయని పైలట్​కు తెలియజేశారు. ల్యాండింగ్​ చేసేందుకు 2-3 సార్లు ప్రయత్నించాడు. కానీ, ఆ సమయంలోనే ప్రమాదం జరిగింది. ” – గులామ్​ సర్వార్​, అని తెలిపారు విమానయానశాఖ మంత్రి.

మాలిర్ ​ ప్రాంతంలో విమానం కూలిపోవటంతో దాదాపు  10 ఇళ్లు, పదికిపైగా కార్లు, మరికొన్ని  వాహనాలు ధ్వంసమయ్యాయి. ధ్వంసమైన, కూలిపోయిన ఇళ్లల్లో నుంచి ప్రస్తుతానికి నాలుగు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు అక్కడి పోలీసులు. ఈ ఘటన ప్రజల నివాసాల వద్ద జరగటంతో స్థానికులు అదిక సంఖ్యలో చనిపోయి ఉంటారని అధికారులు భావిస్తున్నారు.

అయితే ప్రమాదసమయంలో  విమానంలో ఎంత మంది ఉన్నారనే విషయంలో కన్ఫ్యూజన్  నెలకొంది. విమానయాన సంయుక్త కార్యదర్శి సత్తార్​ ఖోఖర్​. 99 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ఉన్నారని చెప్పగా. పీఐఏ ప్రతినిధి అబ్దుల్లా హఫీజ్​ మాత్రం 91 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది ఉన్నట్లు వెల్లడించారు.

దీనిపై భారత ప్రధాని మోడీ విచారం వ్యక్తం చేశారు. మోడీ పాకిస్థాన్ విమాన ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ ట్వీట్​ చేశారు.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular